భారత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికా విచ్చేశారు. న్యూయార్క్‌లోని JFK ఎయిర్‌పోర్టులో కిషన్ రెడ్డికి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కృష్ణా రెడ్డి ఏనుగుల (మాజీ అఫ్-బీజేపీ-జాతీయ అధ్యక్షలు), రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్), వంశీ యంజాల, కృష్ణ మోహన్ ములే, హరి సేతు, దీప్ భట్ తదితర కమ్యూనిటీ లీడర్లు కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మన దేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్’ (ఐక్యరాజ్య సమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం) వేదికగా భారత పర్యాటక మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు ఈ అంతర్జాతీయ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇటీవల గోవాలో జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల మంత్రుల సమావేశాల్లో భారత్ చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు, ఆతిథ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.