Connect with us

Politics

బోండా ఉమా కు ఎన్నారై టీడీపీ మిన్నెసోటా ఘన స్వాగతం

Published

on

నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి ఉత్సవాలు సెప్టెంబర్ 17 శనివారం రోజున మినియాపోలిస్ లో ఎన్నారై టీడీపీ మిన్నెసోటా (NRI TDP Minnesota) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు బోండా ఉమా పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి మినియాపోలిస్ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు బోండా ఉమా (Bonda Uma) కి ఘన స్వాగతం లభించింది. స్థానిక ఎన్నారై టీడీపీ సభ్యులు విమానాశ్రయానికి వెళ్లి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు.

గార్డెన్ రూమ్ ఆఫ్ ఎడెన్ ప్రయిరీ లో సెప్టెంబర్ 17 శనివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్న, అలాగే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected