అంతర్జాలం, నవంబర్ 5, 2023: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంస్థ ‘నాట్స్’ తాజాగా ఆన్‌లైన్ వేదికగా స్టూడెంట్ కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (Student Career Development Program) ను దిగ్విజయంగా నిర్వహించింది.
ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నాట్స్ అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు విద్యార్ధులకోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ వస్తోంది. అండర్ గ్రాడ్యూయేట్, మాస్టర్స్ చదివే విద్యార్ధులకు, కెరీర్ మార్చుకోవాలనే వారికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తాజాగా నిర్వహించిన కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో మైక్రోసాప్ట్ అజూర్ డెవలపర్ టైనింగ్ (Microsoft Azure Developer Training) నిర్వహించింది.
గత నాలుగు వారాలుగా నిర్వహించిన ఈ ట్రైనింగ్‌లో ఆన్‌లైన్ ద్వారా తెలుగు విద్యార్ధులు, యువత, వారి తలిదండ్రులు పాల్గొన్నారు. నాట్స్ ద్వారా యువత కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్న నాట్స్ (NATS) అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతికి విద్యార్ధులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా బాపు నూతి వివరించారు. తెలుగు విద్యార్ధులకు కెరీర్ డెవలప్‌మెంట్‌తో పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిభ గల వారికి ఉపకారవేతనాలు అందించడం చేస్తున్నామని బాపు నూతి (Bapu Nuthi) తెలిపారు.
శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నాట్స్ (NATS) కెరీర్ డెవలప్‌మెంట్ సభ్యులు డీవీ ప్రసాద్, శ్రీధర్ న్యాలమడుగుల, రాజేష్ కాండ్రు, శ్రీనివాస్ చిలుకూరి, రామకృష్ణ బాలినేని, రంజిత్ చాగంటి, హరినాథ్ బుంగతావులను బాపు నూతి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ స్టూడెంట్ కెరీర్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రత్యేక కృషి చేసిన నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్, ఫాకల్టీ ఆషిఫ్ అన్వార్ లకు నాట్స్ (North America Telugu Society) చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti) ధన్యవాదాలు తెలిపారు.