అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల (Telugu Sates) ప్రవాసాంధ్రులు, ప్రవాస సంఘాల ప్రతినిధులు కలిసి, జెండాలు, పార్టీలను పక్కనెట్టి, ఇటీవల జరిగిన తెలంగాణ (Telangana) రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించి, ఉప్పొంగే ప్రజాభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.
నేటి యువతకు, రాజకీయాలలో రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ఆదర్శమని అన్నారు. పోరాట పంథాను ఎంచుకొని ఎన్ని కఠిన సమస్య లెదురైనా వెరవని నైజం, తాను ఎంచుకున్న రంగంలో సమస్యలను అవకాశాలుగా, అపజయాలను అనుభవాలుగా స్వీకరించి ఆయన చేసిన పోరాటం, సాగించిన 17 సంవత్సరాల ప్రతిపక్ష రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించిన రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) పాలన జన రంజకంగా ఉండాలి అని అభిలాషించారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలు మరింత బలపడి, సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ, ప్రగతి పధంలో సాగాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ ప్రవాసులు సతీష్ వేమన (Satish Vemana), త్రిలోక్ కంతేటి, భాను మాగులూరి (Bhanu Maguluri), సుధీర్ కొమ్మి, అమరేందర్ రెడ్డి, సత్య, రాజేష్ కాసారనేని, కౌశిక్ రెడ్డి, విజయ్ గుడిసేవ, సత్య సూరపనేని, మురళి రెడ్డి, బద్రి, రాము తదితరులు పాల్గొన్నారు.