Connect with us

Movies

Suspense Thriller: ‘మిస్టరీ’ సినిమాలో అట్లాంటా వాసి వెంకట్ దుగ్గిరెడ్డి

Published

on

జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగర వాసి వెంకట్ దుగ్గిరెడ్డి గత కొంత కాలంగా ఇటు సినిమాలు అటు వ్యాపార పనులతో బిజీగా ఉంటున్నారు. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా, పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గాలోడు సినిమాలో న్యాయవాది పాత్ర పోషించారు.

ఆ తర్వాత వేరే సినిమాల్లో నటించి ఇప్పుడు ‘మిస్టరీ’ అనే మరో తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) లో రీజినల్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్న వెంకట్ దుగ్గిరెడ్డి రెండు వారాల క్రితం డల్లాస్ లో నాటా కన్వెన్షన్ ముగియగానే మిస్టరీ సినిమా షూటింగ్ నిమిత్తం ఇండియా వెళ్లారు.

సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, సత్య శ్రీ వంటి సీనియర్ నటీనటుల సరసన డిటెక్టివ్ రోల్ లో నటిస్తున్నారు. రెండు రోజుల క్రితం మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నటులు సుమన్ మాట్లాడుతూ డిటెక్టివ్ గా వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) తనదైన స్టైల్ లో నాచురల్ గా బాగా నటించారని అభినందించడం కొసమెరుపు.

పీవీ ఆర్ట్స్ పతాకంపై సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో వెంకట్ పులగం నిర్మాతగా ఈ ‘మిస్టరీ’ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 21 వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేస్తామన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected