అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో స్థిరపడిన వెంకట్ దుగ్గిరెడ్డి (Venkataramireddy Duggireddy) పేరు తెలియనివారు ఉండరు. అప్2డేట్ టెక్నాలజీస్ (Up 2 Date Technologies) అధినేతగా, ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) లో క్రియాశీలక నేతగా పలువురికి సుపరిచితులు.
ముఖ్యంగా ప్రతి గురువారం కమ్మింగ్ (Cumming) నగరంలోని సాయిబాబా గుడి (Saibaba Temple) కి వెళ్లేవారికి వెంకట్ దుగ్గిరెడ్డి కనిపించకుండా ఉండని రోజు ఉండదు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు (Nellore) కు చెందిన ఈ యువ పారిశ్రామికవేత్త కొత్తగా తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు.
నాటా (North American Telugu Association) లో రీజినల్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్న వెంకట్ దుగ్గిరెడ్డి, శంకర నేత్రాలయలో కూడా నేత్రదానం కార్యక్రమంలో ఆర్ధిక సహాయం చేస్తున్నారు. 1997లో అమెరికా వచ్చిన వెంకట్ దుగ్గిరెడ్డి అట్లాంటాలో కొన్ని వారాలపాటు నటనలో శిక్షణ తరగతులు కూడా తీసుకున్నారు.
ఈ మధ్యనే విడుదలైన గాలోడు (Gaalodu) సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన వెంకట్ దుగ్గిరెడ్డి కి మరో రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలిసుధీర్ (Sudigali Sudheer) హీరోగా, పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చక్కని న్యాయవాది పాత్ర పోషించారు.
సప్తగిరి, పృథ్విరాజ్, షకలక శంకర్, సత్య కృష్ణ వంటి ప్రముఖ నటుల సరసన నటించిన మన అట్లాంటా వాసి వెంకట్ దుగ్గిరెడ్డి తో నిరంజన్ పొద్దుటూరి మాటామంతి కార్యక్రమంలో తన అనుభవాలతోపాటు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే క్రింది వీడియో చూడాల్సిందే.