Connect with us

Movies

NATA: నింగికేగిన సినీ ప్రముఖులకు కళాంజలి ద్వారా వర్జీనియాలో ఘన నివాళులు

Published

on

ప్రపంచ దేశాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల కీర్తిప్రతిష్టలను చాటిచెప్పిన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు మనల్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని నాటా (North American Telugu Association) సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నార్తర్న్ ‌వర్జీనియా (Virginia) లోని ఎస్వీ లోటస్‌ టెంపుల్‌లో ఫిబ్రవరి 19న జరిగిన ప్రత్యేక కార్యక్రమం “కళాంజలి“ పేరుతో వీరందరికి ఘనంగా నివాళులర్పించారు. నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు (Sudha Rani Kondapu) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నిర్మాత మరియు దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bharadwaja) గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

తొలుత తమ్మారెడ్డి గారు, శ్రీమతి మల్లికా రాంప్రసాద్ గారు, హరనాథ్ రెడ్డి గార్లు జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో నాటా డిసి మెట్రో విభాగం నుంచి ఆంజనేయ రెడ్డి దొండేటి, సతీష్‌ నరాల, సత్య పాటిల్, మధు మోటాటి, సురేష్‌ కొత్తింటి, రమేష్‌ రెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి సోము, సుజిత్ మారాం, పార్థా బైరెడ్డి, రమణ మద్దికుంట పాల్గొన్నారు.

ఇటీవల మృతి చెందిన తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు దాదాసాహెబ్‌ పాల్కే ఆవార్డు గ్రహీత, కళాతపస్వి కే .విశ్వనాథ్‌ (Kasinadhuni Viswanath), అలనాటి సినీ నటి జమున (Jamuna), సినీ నేపథ్యగాయని వాణీ జయరాం (Vani Jairam) చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్‌తో పాటూ నాటాకు చెందిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఎన్నో కళాత్మక విలువలున్న సినిమాలను తీసి తద్వారా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కళాతపస్వి విశ్వనాథ్‌కు దక్కుతుందని ప్రస్థుతించారు. అందాల నటి జమున గారు సినీరంగంలో ఎలా ధీటుగా నిలబడ్డారో, తన సుమధుర స్వరంతో వేల పాటలు పాడిన వాణి జయరాం తెలుగు పరిశ్రమకు ఎంతో సేవ చేశారని కితాబులిచ్చారు.

అలాగే తమ నటనతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చిన అలనాటి మేటి నటులు సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యన్నారాయణ, చలపతిరావు, తారకరత్న లాంటి వారందరినీ తలచుకుంటూ ఒకే ఏడాది ఇంత మంది ప్రముఖులను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న డాన్స్ స్కూల్ టీచర్లు ఇంద్రాణి గారు, మంజూశ్రీ గారు, ప్రత్యూష గార్లతో పాటు భరత మల్లికా కూచిపూడి డాన్స్‌ స్కూల్‌ విద్యార్ధులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులను పలువురు ప్రముఖులు అభినందించారు.  

4 గంటలసేపు నిర్విరామంగా జరిగిన ఈ కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ (Washington DC) మెట్రో ప్రాంతానికి చెందిన దేశీ టాలెంట్స్ అనే గాయకుల గ్రూపు నుంచి దాదాపు ముప్పై మంది గాయకులు పాల్గొని సభని జయప్రదం చేశారు. స్థానిక వర్జీనియా కి చెందిన గాయకుడు కృష్ణ పొడగట్లపల్లి ఈ కార్యక్రమ సమన్వయకర్తగా, శ్రీమతి శ్రీదేవితో కలసి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

మరొక గాయకుడు శ్రీని చుండి గారు పాటల సేకరణ, వేదిక సమన్వయంలో ఆయనకి సహకరించడంతో పాటు ఘంటసాలగారి శతజయంతిని గుర్తు చేస్తూ, గాయకులు అందరినీ ప్రోత్సహిస్తూ ఈ ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు.

స్థానిక తెలుగు సంఘాల (Telugu Associations) అధినేతలు కవిత చల్లా (TDF), సుధ పాలడుగు (GWTCS), భాను మగులూరి (GWTCS) లోటస్ టెంపుల్ యాజమాన్యం తదితరులునాటా కార్యక్రమానికి హాజరై వారి సంతాపాన్ని తెలియజేశారు.

మనసా వాచా నాతిచరామి నటి మరియు నిర్మాత ఇంద్రాణి దావులూరి, సినీ దర్శకుడు, పిలుపు TV ఛానల్ అధినేత వేణు నక్షత్రం, డా. మధు కాశిపతి, రాజశేఖర్ బసవరాజు, రాణా కవితా చీడళ్ళ, ప్రగతి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected