Connect with us

Devotional

ధార్మిక కార్యక్రమాలు, పేదలకు దుప్పట్ల పంపిణీ @ TTA Seva Days in Telangana

Published

on

TTA సేవా డేస్ కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు మెడికల్ క్యాంప్ రెండవరోజు T-హబ్ సెమినార్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో అట్టహాసంగా పూర్తిచేసుకున్న TTA బృందం, మూడవ రోజు ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. Ganesh Veeramaneni – TTA Ethics Committee Director గారి స్వగ్రామం దేవరగొండ దగ్గర Pendlipakula లో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభానికి వెళ్ళింది.

Ganesh Veeramaneni గారి తండ్రి గారు Madhava Rao Veeramaneni గారు స్వయంగా మృదుస్వభావి, నీతి నియమాలకు పెట్టింది పేరైన వారి కుటుంబం ప్రదాన దాతగా ఉండి దేవాలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. తాము పుట్టిన గ్రామ అభివృద్ధిని మరియు వారి సుఖసంతోషాలు కోరుకునే వారు, పుట్టిన గ్రామ ప్రజలందరూ తమ సోదర వర్గంగా భావిస్తూ ఉంటారు.

ఇదే కాకుండా గ్రామంలోని పేద ప్రజలకు చలికాలం వినియోగానికి గాను బ్లాంకెట్స్ కూడా పంపిణి చేశారు. ప్రజోపకార్యాలలో ముందుండే TTA సభ్యులు పేదలకు బ్లాంకెట్స్ పంపిణి, గ్రామానికి ఒక దేవాలయం ఉండటంతో సకల జనులు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మే TTA ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యింది.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన గణేష్ గారు కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలకు మరియు tta సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం బ్లాంకెట్ ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మాట్లాడుతూ.. గ్రామం లో ఉన్న పచ్చదనం మరియు అమాయక మైన పల్లె ప్రజలకు తమకు తోచిన సాయం చేయడం అనందంగా ఉందన్నారు.

TTA సేవా డేస్ కో.ఆర్డినేటర్ సురేష్ గారు మాట్లాడుతూ ముత్యాలమ్మ తనను ఆశీర్వదించింది అని తెలిపారు. గ్రామ ప్రజలను కలవడం ఎంతో ఆనందం గా ఉందన్నారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయం ప్రారంభం కు రావడం అనందం గా ఉందని మరిన్ని కార్యక్రమాలకు ఈ గ్రామానికి రావాలని ఉందని తెలిపారు.

మాధవరావు వీరమనేని గారు మాట్లాడుతూ తాము చేసే ప్రతి పనిలో TTA భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ శ్రీను గారు మాట్లాడుతూ గ్రామాల్లో దేవాలయాన్ని నిర్మించిన మాధవరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం గ్రామంలోని నిరుపేదలకు బ్లాంకెట ల పంపిణీ చేసేశారు.

సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు, కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, కార్యదర్శిగా కవితారెడ్డి గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.

సేవా డేస్ లో పాల్గొన్న TTA సభ్యులు

Shiva Reddy Kolla – Joint Secretary
Manohar Bodke – Joint Treasurer
Pradeep Mettu – National Coordinator
Ganesh Veeramaneni – Ethics Committee Director
Sangeetha Reddy – Board of Director
Venkat Gaddam – Board of Director
Pradeep Boddu, Abhilash Reddy,
Anil Arraballi, Vani Gaddam
Sridhar Chaduvu, Aahlaad Kareddy

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA Founder Pailla Malla Reddy Garu, Advisory Consul Chair – Vijayapal Reddy గారు, Co-Chair – Mohan Patalolla గారు, Member – Bharat Reddy Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రెసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నది.

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected