భారత దేశ డెబ్బయి అయిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం తెలంగాణ రాష్ట్రం తరపున శకటంను ఏర్పాటు చేసింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలుగా అతి పెద్ద బంగారు బతుకమ్మ, బోనం మరియు పోతరాజు అలంకరణతో అత్యంత సుందరంగా అలంకరించిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) శకటం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. టిటిఎ ప్రెసిడెంట్ డా. మోహన్ రెడ్డి పట్లోళ్ల ఈ వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
మొదటి సారి ఈ వేడుకలలో పాల్గొన్నపటికీ టిటిఎ వాలంటీర్లు అత్యంత గొప్పగా శకుటాన్ని తీర్చిదిద్దారని చెప్పారు. ఈ వేడుకలకు సహాయ సహకారాలు అందించిన టిటిఎ ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైసరీ కౌన్సిల్ చైర్మన్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ డా. హరనాథ్ పొలిచెర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
న్యూయార్క్ వీధుల్లో తెలంగాణ పోతరాజు తిరుగుతుంటే, తెలంగాణ మహిళలు బోనాలు, బతుకమ్మలుతో వెంట రాగ, ఆహూతులందరు తెలంగాణ సాంప్రదాయాలను అడిగి మరి తెలుసుకున్నారు. పోతరాజుగ అశోక్ ప్రతి ఒక్కరిని ఆకర్షించారు. అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వాహకులు టిటిఎ తెలంగాణా శకుటం అందరి మన్నలను పొంది చాలా గొప్పగ అలంకరణ చేసిందని ప్రత్యేకంగా కొనియాడారు.
శకుటంపై బంగారు బతుకమ్మ, తెలంగాణ తల్లి, రాణి రుద్రమ దేవి, శుభాష్ చంద్రబోస్, ఆర్మీ మేజర్ రూపాల చిన్నారుల వేషధారణ చూడ ముచ్చట గొల్పింది. న్యూ యార్క్ వీధుల్లో టిటిఎ శకుటం వెంట షుమారు రెండు వందల మంది మహిళలు మరియు వాలంటీర్లు డప్పులతో బోనం మరియు బతుకమ్మలు ఆడారు.
భారత డెబ్బయి అయిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఏర్పాట్లకు ఎంతో శ్రమించిన శివ రెడ్డి కొల్ల, అశోక్ చింతకుంట, రమ వనమా, నరసింహ పెరుక, నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, పవన్ రవ్వ, దివాకర్ జంధ్యం, కిరణ్ దుడ్డగి లకు మరియు ఈ వేడుకలలో పాల్గొని, ఆధ్యంతం శ్రమించిన వాలంటీర్ల అందరికి పేరు పేరున తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు డా. మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు.