అమెరికాలోని మొట్టమొదటి తెలుగు సంఘం న్యూయార్క్ (New York) లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association) అని అందరికీ తెలిసిందే. 54 సంవత్సరాల ఈ తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) నూతన అధ్యక్షునిగా 2025 సంవత్సరానికి గాను సుమంత్ రామ్‌శెట్టి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సుమంత్ రామ్ (Sumanth Ramsetti) మాట్లాడుతూ… తెలుగు సంఘాలకు మాతృ సంస్థ లాంటి టిఎల్‌సిఎ (TLCA) కు అధ్యక్షునిగా వ్యవహరించే అవకాశం రావడం నా అదృష్టమని, అధ్యక్షునిగా కమ్యూనిటీకి మరింత సేవలందించేందుకు కృషి చేస్తానని, అలాగే TLCA 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా కమ్యూనిటీ ఆదరణను పొందుతున్నదంటే అందుకు పూర్వ అధ్యక్షులు మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, దాతలు, వాలంటీర్లు చేసిన కృషి వల్లనే అని అన్నారు.
TLCA @ New York 2025 నూతన కార్యవర్గం
సుమంత్ రామ్‌శెట్టి (ప్రెసిడెంట్)
మాధవి కోరుకొండ (వైస్ ప్రెసిడెంట్)
శ్రీనివాస్ సనిగెపల్లి (సెక్రటరీ)
అరుంధతి అడుప (ట్రెజరర్)
కిరణ్ రెడ్డి పర్వతాల (ఎక్స్ అఫిషియో పాస్ట్ ప్రెసిడెంట్)
భగవాన్ నడింపల్లి (జాయింట్ సెక్రటరీ)
లావణ్య అట్లూరి (జాయింట్ ట్రెజరర్)
సునీల్ చల్లగుళ్ళ, దివ్య దొమ్మరాజు, ప్రవీణ్ కరణం, సుధ మన్నవ, సునీత పోలెపల్లి సభ్యులుగా ఉన్నారు.