Connect with us

News

NBC TV game show, The Wall: న్యూ జెర్సీ తెలుగు మహిళలకు అరుదైన అవకాశం

Published

on

గ్రీన్ బ్రూక్, న్యూ జెర్సీ: అమెరికాలో అత్యంత ఆదరణ కలిగిన టెలివిజన్ గేమ్ షో ఎన్బీసీ గేమ్ షో ది వాల్ (The Wall) లో తెలుగు మహిళలకు అరుదైన అవకాశం లభించింది. ది వాల్ గేమ్ షో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.

అలాంటి గేమ్ షోలో తెలుగు వారైన కవి, రాధిక పాల్గొన్నారు. వీరిద్దరూ తల్లి, కూతురులు కావడం విశేషం. నాలెడ్జ్, సమయస్ఫూర్తి ఇవన్నీ కలగలిసిన ఈ షోలో ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. అందుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఎన్బీసీ గేమ్ షో ది వాల్ ఎపిసోడ్ 511 సోమవారం జులై 10న అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు (EST) లకు ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.

కవి (Kavi) మరియు రాధిక ఈ షోలో పాల్గొనడం యావత్ తెలుగుజాతికి గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఈ షోలో పాల్గొనే అభ్యర్ధులను వారికి ఉండే జ్ఞానం, ప్రణాళిక, వ్యక్తిత్వం ఇలా రకరకాలుగా పరీక్షించి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ది వాల్ గేమ్ షో ఐదో సీజన్ నడుస్తోంది. ప్రతి సీజన్ అత్యంత జనాదరణ పొందుతూ వస్తోంది.

అమెరికాలో తెలుగువారు ఎన్బీసీ గేమ్ షో లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో అమెరికాలో ఉండే తెలుగువారిలో ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది. న్యూజెర్సీ (New Jersey) లోని గ్రీన్ బ్రూక్ లో ఉంటున్న కవి, రాధిక (Radhika) మంచి డ్యాన్సర్లు కావడం విశేషం. కవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ పేరుతో అమెరికాలో ఇండియన్ డ్యాన్స్‌కు ఆదరణ పెంచుతున్నారు.

మన సంప్రదాయ నృత్యాన్ని కూడా అమెరికన్లకు పరిచయం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్బీసీ గేమ్ షో ది వాల్ (NBC TV Channel) లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. ఈ ప్రసారాన్ని www.NRI2NRI.com/Kavi and Radhika in NBC Game Show The Wall లో వీక్షించవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected