Connect with us

Elections

TAMA: సురేష్ బండారు అధ్యక్షునిగా, రూపేంద్ర వేములపల్లి ఉపాధ్యక్షునిగా 2024 లీడర్షిప్ ఎన్నిక

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (TAMA) 2024 కార్యవర్గ మరియు బోర్డు సభ్యుల ఎన్నికలు ముగిశాయి. 11 మంది కార్యవర్గ సభ్యులు, 5 గురు బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, ప్రతి పదవికి ఒకే నామినేషన్ రావడంతో గత కొన్ని సంవత్సరాల లానే ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవమయ్యింది.

2023 కి తామా (TAMA) ఉపాధ్యక్షునిగా ఉన్న సురేష్ బండారు 2024 కి ఆటోమేటిక్ గా అధ్యక్షునిగా కొనసాగుతారు. రూపేంద్ర వేములపల్లి ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శి పదవికి ఏ నామినేషన్ రాలేదు. అలాగే మిగతా కార్యవర్గ మరియు బోర్డు పదవులకు పలువురు ఎన్నికయ్యారు.

వీరి అందరి వివరాలు పైన ఫ్లయర్ లో చూడవచ్చు. మొత్తం 13 మంది సభ్యులున్న 2024 తామా (Telugu Association of Metro Atlanta) కార్యవర్గానికి, అలాగే 11 మంది సభ్యులున్న తామా బోర్డు (TAMA Board) కి NRI2NRI.COM నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected