తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా (TAGCA) వారు వినూత్నంగా నిర్వహించిన రాయల్ కరీబియన్ క్రూజ్ విహారయాత్ర ఆహ్లాదకరంగా ముగిసింది. హాలిడేస్ సీజన్లో డిసెంబర్ 18 నుండి 22 వరకు 4 రోజులపాటు నిర్వహించిన ఈ క్రూజ్ విహారయాత్ర అందరి మన్ననలు పొందింది.
నార్త్ కెరొలినా లోని చార్లెట్ నుండి ఫ్లోరిడాలోని మయామి వరకు రానూ పోనూ బస్సులు ఏర్పాటుచేయగా దాదాపు 350 మంది పెద్దలు, పిల్లలు ఈ సాహసోపేత విహారయాత్ర లో పాల్గొనడం విశేషం. బస్సు ప్రయాణంలో కూడా ఇండియన్ భోజన ఏర్పాట్లు, టైం పాస్ ఫన్ గేమ్స్ వంటి వాటితో ఆనందంగా సాగింది.
రాయల్ కరీబియన్ క్రూజ్ విహారయాత్రలో బీచ్లు, వాటర్ స్పోర్ట్స్, స్కావెంజర్ హంట్, డాడ్జ్ బాల్, టీన్ క్లబ్, క్యారోకీ, డీజే వంటి ప్రత్యేక యాక్టివిటీస్ తో అందరూ సరదాగా గడిపారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా వారి ప్రత్యేక టీషర్ట్స్ తో ఫోటోలు దిగారు.
చార్లెట్ తెలుగు సంఘం (TAGCA) అధ్యక్షులు రామ్ కలగర ఆధ్వర్యంలోని TAGCA కార్యవర్గం చార్లెట్ తెలుగువారి కోసం మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన ఈ రాయల్ కరీబియన్ క్రూజ్ విహారయాత్ర జీవితాంతం గుర్తు ఉంటుందంటూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
సుమారు 5 నెలలపాటు ప్లాన్ చేసి, బస్సులు, ఇండియన్ ఫుడ్, ఫన్ యాక్టివిటీస్, బడ్జెట్ ఇలా ప్రతిదీ పక్కాగా ప్రణాళిక రచించుకొని వాలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వల్లనే ఇంతటి పెద్ద క్రూజ్ విహారయాత్ర ప్రత్యేకతను సంతరించుకుంది అంటున్నారు TAGCA కార్యవర్గం.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా వారి వినూత్నమైన రాయల్ కరీబియన్ క్రూజ్ విహారయాత్ర మరిన్ని ఫోటోలు మరియు వీడియోల కొరకు www.NRI2NRI.com/TAGCA-Royal-Caribbean-Cruise ని సందర్శించండి.