Connect with us

Health

తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం @ Qatar

Published

on

అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం మరియు ఖతార్ నేషనల్ డే సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం, తెలంగాణ గల్ఫ్ సమితి వారి పిలుపుమేరకు ఖతార్ (Qatar) లోని నలుమూల ప్రాంతాలు అనగా మాల్ అల్కోర్ మెకానిష్ సహనియా తదితర ప్రాంతాల నుండి సుమారు 175 తెలుగు వారు హాజరై 130 వరకు దాతలు పాలుపంచుకున్నారు.

ఇట్టి కార్యక్రమం ఖతార్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ (Qatar National Blood Donation Center) అల్సద్ లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. కార్యక్రమం ప్రారంభ సమయంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు మధు గారు అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ గల్ఫ్ సమితి చేస్తున్న కార్యక్రమాలను సమన్వయంగా వివరించారు.

కార్యక్రమానికి భారత రాయబారి కార్యాలయం నుండి ఫస్ట్ సెక్రటరీ మరియు ICBF CEO డాక్టర్ వైభవ్ తండలే గారు ముఖ్యఅతిథి గా విచ్చేసి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేసినందుకు అభినందించారు. అతిథులుగా ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావగారు మాట్లాడుతూ ఐ సి బి ఎఫ్ చేస్తున్న కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) ఎల్లప్పుడూ ముందుండి మాకు తోడుగా ఉంటుందని కొనియాడారు.

మరో అతిథి ICC ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కాకుండా ఐసిసి తలపెట్టే సంస్కృత కార్యక్రమంలో కూడా గల్ఫ్ సమితి బృందం ఎల్లప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు. అనంతరం తెలుగు సంఘాల సీనియర్ నాయకుడు శ్రీ కోడూరి శ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా తెలుగు వారందరం ఒక్కటై ఏ కార్యక్రమాన్ని చేసిన కూడా తోడుగా ఉంటూ మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందని గుర్తు చేశారు.

అనంతరం రక్తదానం చేసిన సభ్యులందరికీ శాలువాతో సత్కరించి మరియు ప్రశంస పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ICBF కమిటీ సభ్యులు భోబన్ గారు, కుల్దీప్ కౌర్ గారు, మహమ్మద్ కొని గారు, శంకర్ గౌడ్ గారు, అబ్దుల్ రఫ్ గారు, కులివెందుర్ సింగ్ గారు ఐసీసీ నుండి మోహన్ కుమార్ గారు, నందిని అబ్బ గౌని గారు, తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షులు సుధా గారు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ గారు తెలుగు స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షులు శ్రీధర్ అబ్బ గోని గారు మరియు తెలంగాణ గల్ఫ్ సమితి కమిటీ మెంబర్ గడ్డి రాజుగారు, మను, సాగర్, సంజీవ్, సంధ్యారాణి, ప్రియా గార్లు మరియు సలహాదారులు ఎల్లయ్య గారు, శోభన్ గౌడ్ గారు, కృష్ణ గారు మరియు గల్ఫ్ సమితి సభ్యులు అందరూ ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected