Connect with us

Jana Sena

TDP & Janasena అభిమానుల ఆత్మీయ సమావేశం విజయవంతం @ Chicago, Mall of India

Published

on

Chicago: చికాగోలో పసుపు సైనికులు, జనసైనికుల కలయికతో స్థానిక మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) లో జరిగిన టీడీపీ, జనసేన అభిమానుల ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రలోని తమ అధినాయకుల మధ్య చిగురించిన పొత్తుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు బహిరంగంగా కలిసి మద్దతు తెలపడం ఇదే మొదటిసారి.

ఈ కార్యక్రమానికి అతిథులుగా జూమ్ కాల్స్ ద్వారా అనపర్తి టీడీపీ (TDP) ఇంఛార్జి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు, తణుకు ఇంఛార్జి అరుమళ్లి రాధాకృష్ణ గారు, గుడివాడ ఇంఛార్జి వెనిగండ్ల రాము గారు, రైల్వే కోడూరు ఇంఛార్జి ప్రసాద్ గారు అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ జనసేనల కలయిక రాష్త్రం లో ఎలాంటి ప్రకంపనలు సృష్ఠించబోతుందో వివరించారు.

వివిధ వక్తలు ప్రసంగిస్తూ చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి విజన్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి నిష్కళంక మనస్తత్వం, సేవ తత్పరత, పసుపుదళం, జనసైనికుల శక్తి సమ్మిళితమై రాష్ట్రంలోని దుష్ట పరిపాలనను తుదముట్టించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెడుతుందని, అభివృద్ధి పథంలో మళ్ళీ ముందుకు దూసుకుపోతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడం లో టీడీపీ (Telugu Desam Party) సీనియర్ నాయకులు శ్రీ హేమ కానూరు, చికాగో ఎన్నారై టిడిపి అధ్యక్షుడు రవి కాకర, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పెదమల్లు, సెక్రటరీ వెంకట్ యలమంచిలి, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజనల్ కౌన్సిల్ చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్ చిలమకూరు, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, సునీల్ ఆరుమల్లి, యుగంధర్ నగేష్ తదితరులు కృషి చేశారు.

అలాగే చికాగో జనసేన పార్టీ (Jana Sena Party) నాయకులు వెంకట్ బత్తిన, రవి తోకల, రజనీ ఆకురాతి, కుమార్ నల్లం, ఉమాశంకర్, మిల్వాకి టీడీపీ నాయకులు వెంకట్ చిగురుపాటి తదితరులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected