తెలుగుదేశం పార్టీ యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా. కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసారు. యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించేలా ప్రణాళిక రచించారు.
ఈ వేడుకలు కేవలం సంబరాలు చేసుకోవడానికే కాకుండా, ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరిని కలసి వారి బాగోగులు తెలుసుకొని, స్థానిక సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతం చేసి అధికారం దిశగా పయనించడానికి ప్రణాళికలు రచించి అధినాయకత్వంతో పంచుకోవడానికి వేదిక కానున్నాయి. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
యూరప్ ఖండంలో నివసిస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులను 63 నగరాల్లో జరిగే వేడుకలకు సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఎన్.ఆర్.ఐ టీడీపీ సెల్ రాంప్రసాద్, రాజశేఖర్ ల అనుసంధానంతో ఐర్లాండ్ – వెంకట కృష్ణ ప్రసాద్, నెదర్లాండ్స్ – వివేక్, నార్వే – వెంకటపతి, డెన్మార్క్ – అమర్నాథ్, బెల్జియం – కొండయ్య, పోలాండ్ – చందు, ఫ్రాన్స్ – మహేష్, స్వీడన్ – ప్రవీణ్, పోర్చుగల్ – దశరధ్, మాల్టా – దినేష్, జర్మనీ – శివ, టిట్టు, ఇటలీ – సతీష్, స్విట్జర్లాండ్ – శ్రీనివాస్, లాట్వియా – మీరా కుమార్, ఫిన్లాండ్ – రామకృష్ణ, యునైటెడ్ కింగ్డమ్ – కొంతమంది ఎన్నారై కౌన్సిలర్లు మరియు తెలుగుదేశం ఆత్మీయుల భాగస్వామ్యంతో ఘనంగా 40వ వార్షికోత్సవ వేడుకలు జరుపుటకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఆదివారం జరిగిన సమావేశం ద్వారా ధృవీకరించుకుని తెలుగుదేశం అధినాయకత్వానికి తెలియపరిచామని తెలుగుదేశం యూరప్ విభాగం మీడియా సమన్వయకర్త శ్రీనివాస్ ప్రెస్ నోట్ విడుదల చేసారు.