Connect with us

Health

టాంటెక్స్, సౌత్ ఫోర్క్ డెంటల్ ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతం

Published

on

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ మరియు సౌత్ ఫోర్క్ డెంటల్ సంయుక్తంగా శనివారం మార్చి 26 న డాలస్ లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో బీపీ, షుగర్ చెక్ చేయడం, డెంటల్ చెకప్, అలాగే ఆహార డైట్, బరువు తగ్గడం తదితర అంశాలపై సలహాలు అందించారు. గత మెడికల్ రికార్డ్స్ తెచ్చుకున్నవారికి సెకండ్ ఒపీనియన్ చెప్పారు.

ఈ ఆరోగ్య శిబిరాన్ని చక్కగా నిర్వహించినందుకు సౌత్ ఫోర్క్ డెంటల్ కి చెందిన డా బిందు కొల్లి, వారికి సహకరించిన డా కృష్ణ ఎల ప్రోలు, డా వందన మద్దాలి, డా శిల్ప దండ, డా దీపిక కోయ, డా ప్రసాద్ మద్దుకూరి, డా అనురాధ కొల్లూరు, రేఖ కోయ, వాలంటీర్లు గా పనిచేసిన స్కూలు విద్యార్థిని, విద్యార్థులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమా మహేష్ పార్నపల్లి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, వెంకట్ ములుకుట్ల, చంద్ర పొట్టిపాటి, ఉదయ్ నిడిగంటి, అనంత్ మల్లవరపు మరియు శ్రీనివాసులు బసాబత్తిన పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected