Connect with us

Health

తానా సేవల్లో నూతన అధ్యాయం – టెలీ ఆరోగ్య కేంద్రం

Published

on

  • తెలుగు ప్రజలకి సేవలో నూతన అధ్యాయం
  • ప్రతి ఆదివారం తానా టెలీ ఆరోగ్య కేంద్రం
  • అమెరికా, యూకే, ఇండియా వైద్యులు అందుబాటులో

తెలుగు ప్రజలకి సేవలో తానా మరో ముందడుగు వేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారం వారం టెలీ ఆరోగ్య కేంద్రం అనే నూతన సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలో ఉండే అందరి తెలుగు వాళ్ళకి అందుబాటులో, వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సలహాలు సూచనలకు ఏర్పాటు చేసారు.

అమెరికా, యూకే మరియు ఇండియాలో పేరుగాంచిన ప్రముఖ వైద్యులతో ప్రతి ఆదివారం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు అంటే ఇండియా సమయం సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు ఆన్లైన్ జూమ్ కాల్ లో ఫ్యామిలీ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకాలజీ, క్రిటికల్ కేర్, న్యూరో క్రిటికల్ మరియు స్లీప్ మెడిసిన్ కి సంబంధించిన ప్రముఖ వైద్యులు అందుబాటులో ఉంటారు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు eglobaldoctors.com లో తమ వివరాలతో పాటు కావాల్సిన సర్వీసెస్ కొరకు నమోదు చేయించుకోగలరు.

error: NRI2NRI.COM copyright content is protected