తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మరియు సామినేని ఫౌండేషన్ సంయుక్తంగా ఖమ్మం జిల్లాలోని పాఠశాలకు సహాయం అందించారు. వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో మధిర మండలం లోని మాటూరిపేట గ్రామ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు సెప్టెంబర్ 24న సుమారు 70 వేల రూపాయల విలువచేసే డ్యూయల్ డెస్క్ బెంచీలు, పేద మధ్య తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో తానా మరియు సామినేని వ్యాజ్జయ్య ట్రస్ట్ బాద్యులు, సామినేని నాగేశ్వరావు గారి దంపతులు, రంగారావు గారు, బండి నాగేశ్వరావు గారు వీటిని అందజేశారు. ఇంకా నెల్లూరు రవి గారు, మాదాల రాంబాబు, మాదల నరసింహారావు , శ్రీను, వాసు, కళాకారులు, చిలువేరు శాంతయ్య, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖవారు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లితండ్రులు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ట్రస్టీ రవి సామినేని, సామినేని ఫౌండేషన్ చైర్మెన్ నాగేశ్వరరావు సామినేని లకు అభినందనలు తెలియచేసారు.
గతంలో సామినేని ఫౌండేషన్, తానా ఆధ్వర్యంలో మాటూరుపేట గ్రామానికి ఎన్నో సేవాకార్యక్రమాలు అందించారు. తానా వారు, సామినేని వ్యాజ్జయ్య ట్రస్ట్ వారు దేశానికి రైతు సేవలు అవసరమని, రైతులకు 250 కిట్స్, రోనా కష్టకాలంలో పల్స్ మీటర్లను, 6 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ను అందజేశారు.