Bloomfield Hills, Michigan: మిచిగన్ రాష్ట్రానికి చెందిన Telugu NRI సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ (Wayne State University) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ మధ్యనే ముగిసిన టగ్ ఆఫ్ వార్ లా సాగిన ఎన్నికల్లో తలలు పండిన అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరపున మంచి మెజారిటీతో సన్నీ రెడ్డి (Sunny Reddy) గెలిచారు.
జనవరి 1, 2025 న మొదలైన తన టర్మ్ 8 సంవత్సరాల అనంతరం డిసెంబర్ 31, 2032 న ముగుస్తుంది. ఈ మేరకు మిచిగన్ రాష్ట్ర సీల్ తో సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (Secretary of State) జోస్లీన్ బెన్సన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పత్రంపై బోర్డ్ ఆఫ్ స్టేట్ కాన్వాసర్స్ సంతకాలు కూడా ఉన్నాయి.
బ్లూమ్ ఫీల్డ్ హిల్స్ (Bloomfield Hills, Michigan) వాసి సన్నీ రెడ్డి ఈరోజే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాలోని తెలుగువారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయం అని ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా NRI2NRI.COM నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం.
కాలేజ్ ట్యూషన్ కాస్ట్స్ (Tuition Costs) తగ్గించి విద్య ను అందరికీ అందుబాటులోకి తేవడం, విద్య ని రాజకీయాలకు అతీతంగా ఉంచడం, ఆలంనై తో కెరీర్ గైడెన్స్ (Alumni Career Guidance) సేవలను ప్రస్తుత విద్యార్థులకు అందించేలా చేయడం వంటి విషయాలను తన కర్తవ్యంగా వివరించి మిచిగన్ ఓటర్లను (Michigan Voters) ఆకట్టుకున్నారు.
సన్నీ రెడ్డి కి అమెరికా తెలుగు సంఘం (American Telugu Association – ATA) తో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా కూడా ఆటా కి సేవలందిస్తున్నారు. 2017 లో హూస్టన్, 2021 లో కెంటకీ, 2024 లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ (American Red Cross) తో పని చేయడమే కాకుండా కావాల్సిన ఫండ్స్ రైజ్ చేశారు.