Charlotte, North Carolina: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో ఛార్లెట్ లో డిసెంబర్ 20వ తేదీన ‘రూఫ్ అబోవ్ షెల్టర్’ (Roof Above Shelter) వద్ద సుమారు 200 మందికి పిజ్జా, వింగ్స్ మరియు సోడాతో కూడిన ఫుడ్ ను వడ్డించారు. దీనితో పాటు, 1,000 పౌండ్ల బరువున్న 400 క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్ బ్యాగులను విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంకోసం ఛార్లెట్ లోని తానా (TANA) నాయకులు, యువ వలంటీర్లు చేసిన విశేష కృషితో కార్యక్రమం విజయవంతమైంది. యువ వలంటీర్లు హాసిని మల్లెల, ప్రణవ్ మల్లినేని, కీర్తన కొత్తపల్లి, కార్తికేయ మల్లెల, రోషన్ వడ్లమూడి, గణిత్ బోడిపూడి, అఖిల్ చెరుకూరి మరియు ఇతరులకు తానా నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అవసరంలో ఉన్నవారికి సేవ చేయడంలో వీరు చూపిన కృషి, పట్టుదల ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తమ వంతు సహకారాన్ని అందించిన కిషోర్ బోడిపూడి మరియు కిరణ్ యార్లగడ్డకు కూడా తానా నాయకులు (TANA Leaders) హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా నాయకులు
రవి (నాని) వడ్లమూడి, అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్
నాగ పంచుమర్తి, స్పెషల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
కిరణ్ కొత్తపల్లి, టీమ్ స్క్వేర్ చైర్
మాధురి ఏలూరి, హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్
ఠాగూర్ మల్లినేని, తానాఫౌండేషన్ ట్రస్టీ
ఈ సందర్భంగా ఛార్లెట్ (Charlotte, North Carolina) లోని తానా నాయకులు మాట్లాడుతూ… ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి తమ మార్గదర్శకత్వాన్ని, నిరంతర మద్దతును అందించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి (Naren Kodali), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు (Srinivas Lavu), మరియు కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే దాతలకు, తల్లిదండ్రులకు, స్వచ్ఛంద సేవకులకు మరియు ఈ తానా (Telugu Association of North America – TANA) ఫుడ్ డ్రైవ్ (Food Drive) కార్యక్రమాన్ని ఇంతటి అర్థవంతమైన విజయంగా మార్చిన కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా ఛార్లెట్ (Charlotte, North Carolina) తానా నాయకులు ధన్యవాదాలు చెప్పారు.