Connect with us

Elections

టీం కోడాలి కి గోగినేని మద్దతు మర్మమేమిటి? రంజుగా రాజకీయం @ TANA Elections

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఎలక్షన్స్ లో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రంజుగా రాజకీయం నడిపిస్తున్నారు. లేటెస్ట్ సమీకరణాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న శ్రీనివాస్ గోగినేని (Srinivas Gogineni) పోటీ (Elections) నుంచి తప్పుకొని డాక్టర్ నరేన్ కోడాలి సారధ్యంలోని టీం కోడాలి కి పూర్తి మద్దతు ప్రకటించారు.

నరేన్ కొడాలి (Naren Kodali) గత వారాంతం డెట్రాయిట్ (Detroit, Michigan) లో శ్రీనివాస్ గోగినేని ని కలిసి చక్రం తిప్పినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా శ్రీనివాస్ గోగినేని ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో ఏమైంది? ఈ సమయంలో పోటీ నుంచి ఎందుకు విరమించుకుంటున్నారు? ఈ మిలాఖత్ వెనుక మర్మమేమిటి? వంటి ప్రశ్నలకు ఈ క్రింది విధంగా స్పందించారు తానా సీనియర్ నాయకులు శ్రీనివాస్ గోగినేని.

ఆ సమావేశంలో తానా (Telugu Association of North America) ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు పై విపులంగా చర్చించారు. శ్రీనివాస్ గోగినేని (Srinivas Gogineni) కృషి చేయాలని ఆశిస్తున్న అనేక విషయాలపై నరేన్ కోడాలి కూడా అంగీకరిస్తూ వాటిని సాకారం చేయటానికి కలసి పనిచేయటానికి సంసిద్దులైయ్యారు.

తానా సమగ్రతకై ప్రస్తుత వర్గ పోరాటాల్లో ఎవరో ఒకరి పూర్తి ఆధిపత్యం తాత్కాలికంగానైనా అత్యవసరమని భావించడం, కొన్ని ముఖ్య కార్యక్రమాల కొరకై సుమారు 250,000 డాలర్స్ నరేన్ స్వంతంగా సమకూర్చుతూ మరో 500,000 డాలర్స్ సమీకరణకు వ్యక్తిగత హామీ ఇవ్వడం తన నిర్ణయానికి ముఖ్య కారణమంటున్నారు శ్రీనివాస్ గోగినేని. తానా సభ్యులందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నానని కూడా తెలిపారు. ఆ విషయముగా తనకు చేతనైనంత వరకు నరేన్ విజయానికి కృషి చేస్తానని కూడా గోగినేని తెలిపారు

గత ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి వర్గానికి లీడ్ గా ఉంటూ ‘టీం గోగినేని’ పేరుతొ ఉధృత ప్రచారం కొనసాగించినప్పటికీ ఆ ఎన్నికలను మధ్యలో తానా బోర్డు (TANA Board) రద్దుచేసి అక్రమంగా సెలక్షన్ ప్రక్రియ ద్వారా అన్ని పదవులను భర్తీ చేయడము, దానిని మేరీల్యాండ్ కోర్ట్ (Maryland Court) చట్ట విరుద్ధంగా భావిస్తూ తిరిగి ఎన్నికలు జరపమానడం ద్వారా తిరిగి ఎన్నికలు జరుగుతున్నాయి.

తనకు ఏ పదవీ ఇవ్వనప్పటికీ, నరేన్ కొడాలి ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (Executive Vice President) గా అంగీకరిస్తూ సెలక్షన్ ప్రక్రియ తప్పనీ, తద్వారా తానా కు దీర్ఘ కాలంలో చెడు జరుగుతుందని వాదిస్తూ ఎన్నికలలోనే (Elections) ఇటువంటి సర్దుబాటు చేసుకోవాలని అనేక మాధ్యమాల ద్వారా తెలియపరిచారు. ఇప్పుడు అదే విషయమై ఎన్నికల్లో సర్దుబాటుకై గోగినేని వ్యక్తిగతంగా కృషి చేసినప్పటికీ సెలక్షన్స్ లో నరేన్ తో పాటు పదవులు పంచుకొన్న అనేకమంది ఇప్పడు వ్యతిరేకంగా పోటీ చేయడము మంచిది కాదని కూడా భావిస్తున్నారు.

కాగా శ్రీనివాస్ గోగినేని మరియు నరేన్ కొడాలి తానా (TANA) లో అనేక సంవత్సరాలు కలసి పనిచేసారు. ముఖ్యంగా నరేన్ బోర్డు చైర్మన్ (TANA Board Chairman) గా ఉన్నప్పుడు, ఇంకా గోగినేని ఫౌండేషన్ చైర్మన్ (TANA Foundation Chairman) గా ఉన్నప్పుడు తానా బోర్డు లో చురుకుగా కలసి పనిచేస్తూ పలువురి మన్ననలు అందుకున్నారు. అలాగే రెండు సార్లు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ ఒక్క పరుష పదజాలము కూడా ఒకరిపై ఒకరు వాడుకోకపోవడము గుర్తించాల్సిన విషయము.”

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected