Connect with us

Health

శంకర నేత్రాలయ USA సేవలను విస్తృతం చేసేలా Chicago చాప్టర్ ప్రారంభం @ Lemont, Illinois

Published

on

Chicago: శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల (Sri Kanchi Kamakoti Peetham) ఆశీస్సులతో భారతదేశంలో అంధత్వ నిర్మూలన, అందరికీ నేత్ర వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో 1988 లో Sankara Eye Foundation కు అనుబంధంగా శంకర నేత్రాలయ USA సంస్థ స్థాపించబడింది.

ప్రవాస భారతీయుల (NRI) సహకారంతో అప్పటి నుండి భారత్ లోని అనేక రాష్ట్రాలలో కంటి ఆసుపత్రులు (Eye Hospitals) నిర్మించటానికి అవసరమైన నిధులను సేకరించడం జరిగింది. ఈ క్రమంలో సంస్థ యొక్క సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో అమెరికాలోని వివిధ నగరాల్లో స్థానిక చాప్టర్లను ఏర్పాటు చేయటం జరుగుతోంది.

ఈ క్రమంలో చికాగో చాప్టర్ (Chicago Chapter) స్థాపించాలని సంకల్పించింది. శ్రీ పవన్ నారమ్ రెడ్డి (Sree Pavan Naramreddy ) ధర్మకర్తగా, డా॥ హిమచంద్ర చేబ్రోలు (Himachandra Chebrolu) ఉపాధ్యక్షులుగా శంకర నేత్రాలయ USA సంస్థ యొక్క చికాగో అధ్యాయం నవంబర్ 10వ తేదీన లెమాంట్ రామాలయ ప్రాంగణంలో విజయవంతంగా ఆవిష్కరించారు.

వీరు శంకర నేత్రాలయ ఆవిర్భావం, ప్రస్థానం, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో AR Entertainments వారి సహకారంతో జూనియర్, సీనియర్ విభాగాల్లో నృత్య పోటీలు (Dance Competition) నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.

ఈ పోటీలకు గురు శ్రీమతి మీనా తోట గారు, మరియు శ్రీ కిరణ్ (సినీ నృత్య దర్శకులు శేఖర్ మాస్టర్ సహచరుడు) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల (Competitions) నిర్వహణ బాధ్యతలు తీసుకుని విజయవంతంగా నిర్వహించిన మాలతి దామరాజు (Malathi Damaraju) గారికి సంస్థ కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.

జూనియర్ (Juniors) విభాగంలో షిర్లాజ్ డాన్స్ అకాడమీ ప్రధమ స్థానంలోనూ, ముద్ర డాన్స్ అకాడమీ ద్వితీయ స్థానంలోనూ నిలిచారు. సీనియర్ (Seniors) విభాగంలో మోషన్ & వేవ్స్ ఉపాసన టీమ్ ప్రధమ బహుమతిని అందుకోగా ఫ్లైగర్ల్స్ తులసి వేముల టీమ్ ద్వితీయ బహుమతిని అందుకున్నారు.

భారతదేశం లోని వివిధ రాష్ట్రాలలో శంకర నేత్రాలయ (Sankara Eye Foundation) ఆసుపత్రులలో అందిస్తున్న నేత్ర వైద్య సేవలు, గ్రామీణప్రాంతాలలో నిర్వహిస్తున్న నేత్ర వైద్య శిబిరాలు మున్నగువాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుమారు $50,000 డాలర్లు విరాళంగా అందించి శంకర నేత్రాలయ సంస్థకు తమ సంఘీభావం ప్రకటించారు.

error: NRI2NRI.COM copyright content is protected