తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచిత రగ్గులు, చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుదె (Purusothama Chowdary Gude) సహకారంతో ఈ సేవాకార్యక్రమం నిర్వహించారు.
రాయలసీమలోని అనంతపురం (Anantapur) నగరంలో గల పలు వృద్దాశ్రమాలలో ఉన్న 200 మంది వృద్ధులకు శీతాకాల రగ్గులు, చీరలను మాజీ కార్పొరేటర్ (Corporator) పరిమి రాజారావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వృద్దాశ్రమాల నిర్వాహకులు పురుషోత్తం చౌదరి గుదె మరియు తానా సంస్థని అభినందించారు.
సురక్ష వృద్దాశ్రమము, సెయింట్ విన్సెంట్ డి. పాల్ వృద్దాశ్రమము, ఆశ్రమ వృద్దాశ్రమములలో ఈ రగ్గులు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో బెల్లం మారుతి, సతీష్, సుధాకర, చౌదరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.