అక్టోబర్ 2న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జన్మదిన సందర్భంగా స్కాట్లాండ్ లోని అబర్డీన్ నగరంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సభ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యులు గాంధీ మహాత్ముణ్ని తలచుకొని నేడు తమ స్వస్థలం అయిన ఆంధ్ర రాష్ట్రం లో నెలకొని ఉన్న అరాచక పాలన ను ఖండించారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పై వారు వ్యవహరిస్తున్న తీరును ముక్తకంఠంతో ఖండించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన చేపట్టిన నిరాహారదీక్షకు తమ సంఘీభావం ప్రకటించారు.
డాక్టర్ నాగ ప్రమోద్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రగతికై తన జీవితాన్ని ధారపోసిన తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు పై అనైతికంగా అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆయన వయస్సుకు, అనుభవానికి విలువ ఇవ్వకుండా ఆయన వ్యక్తిగత హక్కులను సైతం హరించే విధంగా వ్యవహరిస్తున్న వైకాపా (YSR Congress Party) ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
ఈ సభలో ప్రదీప్ వేజెండ్ల, అజయ్ నార్నె, రావి శ్రీనివాస్, రంగనాథ్ గడగొత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం తెదేపా (Telugu Desam Party), జనసేన మద్దతుదారులు కార్లతో CBN ఆకృతిని, పిదప ర్యాలీని నిర్వహించారు. జనసేన (Janasena) మద్దతుదారులు కూడా ఈ నిరసనకు తమ సంఘీభావం తెలిపారు.