ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు (Telugu Desam Party) అక్రమ అరెస్టుకు నిరసనగా అమెరికా ప్రధమ రాజధాని ఫిలడెల్ఫియా (Philadelphia) లో “న్యాయానికి సంకెళ్లు” కార్యక్రమంలో టీడీపీ / ప్రవాస భారతీయలు పాల్గొన్నారు.
అమెరికాకు స్వాతంత్య్రాన్ని రూపొందించి భద్రపరిచిన రాజ్యాంగ కేంద్రం దగ్గర మరియు ప్రధమ రాజధాని ఫిలడెల్ఫియా సిటీ హాల్ (Philadelphia City Hall) దగ్గర వారి నిరసన తెలియజేసి, చంద్రబాబు (Nara Chandrababu Naidu) పోరాటానికి మద్దతు తెలియజేసారు.
ఈ సందర్భంగా ఉయ్ వాంట్ జస్టిస్, సేవ్ డెమోక్రసి, సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఉయ్ ఆర్ విత్ సిబిఎన్ అంటూ పలు నినాదాలు చేశారు. ప్లకార్డ్స్, చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని న్యాయానికి సంకెళ్లు వేశారంటూ నిరసన తెలియజేశారు.