ఎన్నారై టిడిపి కువైట్ (NRI TDP Kuwait) మరియు జనసేన (Janasena) కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో వియ్ స్టేండ్ విత్ సిబిఎన్ (We stand with CBN) అనే కార్యక్రమాన్ని ఫర్వానియా లో ఉన్న ద్వైహి ప్యాలస్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా సి.ఐ.డి అరెస్టు చేసి గత 12 రోజులుగా రిమాండ్ పేరిట రాజమండ్రి జైల్లో ఉంచి జగన్ ప్రభుత్వం తీర్చుకుంటున్న కక్షపూరిత చర్యలను ముక్తకంటంతో ఖండించారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలిసి పనిచేసి సైకో పాలనకు చమరగీతం పాడాలని అన్నారు. చంద్రబాబు దేశంలోనే ఎలాంటి మచ్చలేని నాయకుడని, ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని అందరు ఆకాంక్షించారు. వియ్ స్టేండ్ విత్ సిబిఎన్, సైకో పోవాలి – సైకిల్ రావాలి, జగన్ పోవాలి – పాలన మారాలి, ఐ యాం విత్ సిబిఎన్ అనే నినాదాలతో హోరెత్తించారు.
తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, నాగేంద్రబాబు అక్కిలి, ఈశ్వర్ నాయుడు మద్దిన, బాలకృష్ణ, షేక్ బాషా, దుగ్గి శ్రీనివాస్, కొల్లి ఆంజనేయులు, వంశీ, నరేష్, శివ, చిన్నబాబు గున్న, విసి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గాజులపల్లి, సుబ్బ రాజుదొడ్డి పల్లి, కోడూరి మహేష్ గౌడ్, విజయ్ కుమార్ పసుపులేటి, బొమ్ము నరసింహులు రషీదా, బాలరెడ్డయ్య, గూదే శంకర్, రమేష్ మరియు జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, కోనసీమ రాజేష్, దండు వేణు, శేఖర్, బిరడా సూర్యనారాయణ, ఇమ్మిడిశెట్టి సూర్యనారాయణ తదితరులు, కువైట్ మహాసేన నాయకులు రాపాక రాజేష్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన తెలుగుదేశం (Telugu Desam Party) నాయకులకు, కార్యకర్తలకు, జనసేన (Janasena) నాయకులకు, జన సైనికులకు ప్రతిఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు.