Connect with us

Government

చంద్రబాబుకి సంఘీభావంగా జగన్ ప్రభుత్వంపై నిరసన @ Bay Area, California

Published

on

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు దేశాలలోని ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని బే ఏరియాలో ఎన్ఆర్ఐ టీడీపీ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బే ఏరియా ఎన్నారై టీడీపీ నేత వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు అరెస్టుకు సంఘీభావం తెలుపుతూ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాలిఫోర్నియా (California) లోని డబ్లిన్లో ఉన్న ఎమరాల్డ్ పార్క్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలు నగరాల నుంచి ఎన్నారై టిడిపి (Telugu Desam Party) కార్యకర్తలు హాజరయ్యారు. వీరంతా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నారై టిడిపి (NRI TDP) కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. లండన్ లో ఉన్న జగన్ చంద్రబాబు అరెస్టును చూసి ఆనందిస్తున్నారని టిడిపి ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

లండన్ లో పిచ్చోడు, జైల్లో మంచోడు అంటూ నినదించారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును, ఆయనకు జరిగిన అన్యాయాన్ని దేశంతో పాటు అంతర్జాతీయ వేదికపై కూడా చాటి చెప్పేందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో చంద్ర గుంటుపల్లి, వేముల శ్రీనివాస్, విజయ్ గుమ్మడి, శ్రీనివాస్ శాఖమూరి, సత్యం పిసల, విష్ణు రామినేని, రామ్ బైరపనేని, సురేష్ పోతినేని, వెంకట్ తానికొండ, భాను పోలినేని, వెంకట్ అడుసుమల్లి, గాంధీ పాపినేని, విలేఖ్య, గీత ఆలపాటి, దేవయాని కోమటినేని, శిల్ప మద్దినేని, షర్మిల గడ్డిపాటి, రాజా కొల్లి, అనిల్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected