Connect with us

News

కొమ్మారెడ్డి పట్టాభి సమక్షంలో బోస్టన్ మహానాడుకు శంఖారావం పూరించిన ఎన్నారై టీడీపీ

Published

on

మే 20, 21 న బోస్టన్ వేదికగా జరగనున్న ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా… అనే పిలుపుతో 250 పైచిలుకు అభిమానులు శంఖారావం సభకు హాజరై కరతాళ ధ్వనుల మధ్య టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మరియు గారపాటి విద్య తో సమావేశమయ్యారు.

తెలుగు మహిళలు అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించారు. ఈ సందర్బంగా గారపాటి విద్య మాట్లాడుతూ ప్రతి ఎన్నారై రోజుకి ఒక 15 నిమిషాలు సమయం వెచ్చించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానీకానికి తెలుగుదేశం యొక్క సిద్ధాంతాన్ని, లక్ష్యాలను వివరించి ఆలోచింప చేయాలని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ గా చూడాలనుకున్న మన ఆంధ్రప్రదేశ్ ను జగన్ అంధకార ఆంధ్రప్రదేశ్ చేశారని విచారం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తనదైన శైలిలో ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టారు. 60 నిముషాలపాటు అనర్ఘళంగా తన వాక్చాతుర్యంతో ఎన్నారై సోదరసోదరీమణులను మంత్ర ముగ్ధులను చేశారు. అనంతరం మహానాడు కేక్ కట్ చేసి, లోగో ను మరియు టీజర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు కు సిద్ధం అని జయ జయ ధ్వానాలు పలికారు. చిన్న పిల్లలు మరియు తెలుగు మహిళలు తమ శైలిలో తెలుగుదేశం జెండాలతో జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్ర బాబు, జై లోకేష్, మహానాడు కు సిద్ధం అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు.

error: NRI2NRI.COM copyright content is protected