పోలండ్ లో మొట్టమొదటిసారి కనీ వినీ ఎరుగని రీతిలో పోలండ్ తెలుగు అసోసియేషన్ (PoTA), తమిళ్ సంగం అసోసియేషన్ ఆఫ్ పోలండ్ (TSAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో మరియు ఎంబసీ ఆఫ్ ఇండియా (Embassy of India) వారి మద్దతుతో Poland రాజధాని వార్సా (Warsaw) లో గ్రాండ్ ఫెస్టివల్ దీపావళి వేడుకలు ఆదివారం,19th నవంబర్ న అంగరంగ వైభవంతో ఆకాశాన్నిఅంటాయి.
ఈ కార్యక్రమానికి, ముఖ్య అతిధి గా పోలాండ్‌లోని భారత రాయబారి శ్రీమతి నగ్మా మొహ్మద్ మాలిక్ గారితో పాటు, వివిద దేశాలకు చెందిన భారత రాయబారులు మరియు పోలండ్ కౌన్సిల్ జనరల్స్ హాజరైనారు. వీరిలో భారత రాయబారి శ్రీమతి నగ్మా మొహ్మద్ మాలిక్ గారు కీలక ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమానికి వీరందరూ హాజరై మరింత శోభను తీసుకువచ్చారు. భాష, మతం, కులాలకు అతీతంగా పోలండ్‌లో నివసిస్తున్న భారతీయులందరినీ ఒకే వేడుకలో చేర్చడంలో పోలండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) విజయం సాధించిందని PoTA అధ్యక్షుడు చంద్ర భాను, ఫౌండర్ హరి చందు తెలిపారు.
ఈ గ్రాండ్ ఫెస్టివల్‌లో తెలుగు (Telugu), తమిళం, పోలిష్ మరియు యూరోపియన్ పౌరులతో సహా పెద్ద సంఖ్యలో భారతీయ ప్రజలు పాల్గొన్నారు. ఆకట్టుకునే ప్రదర్శనలు, మ్యాజిక్ షో, చిన్నారులకు ఫేస్ పెయింటింగ్, పెద్దలకు సరదా ఆటలు నిర్వహించారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 8:30 గంటల వరకు ఆహ్లాదకరంగా వివిధ కార్యక్రమాలతో పాటు చివరిగా అద్భుతమయిన DJ డాన్స్ తో ముగిసింది. వివరాల్లోకి వెళ్తే అత్యంత ప్రతిభావంతులయిన పిల్లలు, పెద్దలు తమ యొక్క నాట్య, సంగీత, ప్రతిభలతో ప్రేక్షకులను అలరించారు.
దీనిలో మరీ ముఖ్యంగా Poland కళాకారులు మన భారతీయ నృత్యాలను ఎంతో అంకితభావం మరియు నిబద్ధతతో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మెడల్స్ మరియి ప్రశంసాపత్రాలును PoTA, TSAP అధ్యక్షులు అందజేశారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ వేడుకలు ప్రతీదీ సజావుగా జరగటానికి అవిశ్రాంతిగా పనిచేసిన PoTA వారి టీమ్ – సరోజినీ కందుల (భవాని), కాంతిలత చితికిరెడ్డి (మధు), విశ్వశాంతి గద్దేపల్లి, స్వాతి అక్కల, నీహారిక గుండ్రెడ్డి, కిరణ్మయి, శశికళ కాట్రగడ్డ, బాపిరాజు ధుమంతారావు, సురేష్ పెరుమాళ్ల, భార్గవ్ రామ్ దెందుకూరి, రాజశేఖర్ యేసిరెడ్డి, సందీప్ శ్రీనాధుని , రామసతీష్ రెడ్డి , సుబ్బిరామి రెడ్డి భావిరెడ్డి, పృధ్వీ ఆళ్ళ లకు అభినందనలు.
అలాగే Volunteers నిధీష్ అక్కల, మేధా అక్కల, ఆదిత్య కందుల, భూమిజ, సౌమిత, కౌశిక్ నెరియనూరి లకు హృదయపూర్వంగా ధన్యవాదములు. వీరందిరితో పాటుTSAP టీమ్ వారు కూడా ఈ వేడుకలు విజయవంతం కావటానికి తమవంతు కృషి చేశారు.
మన తెలుగు వారి అభిరుచులకు తగ్గట్లుగా పసందయిన వెజిటేరియన్ అండ్ నోన్-వెజిటేరియన్ వంటకాలతో విందు భోజనాలను తలపించే విధంగా Unlimited Buffet తో Curry King రెస్టారెంట్ వారు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
పోలండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association) వారి దీపావళి పండుగ ముగింపులో, భారీ మంచు మధ్య, ప్రజలు బాణసంచా (Fireworks) పేల్చి దీపావళి (Diwali) ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు.