Connect with us

Birthday Celebrations

వైభవంగా NTR శతజయంతి ఉత్సవాలు @ Netherlands, Europe

Published

on

నెదర్లాండ్స్ లోని ది హేగ్ నగరంలో NTR శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుండి వచ్చిన NTR అభిమానులు ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఘనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చిన ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ మరియు ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆన్లైన్ లో పాల్గొని NTR తో తమ జ్ఞాపకాలు పంచుకొని ప్రత్యక్షంగా పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ దేశంలోని NTR అభిమాన సంఘం కార్యవర్గం సభ్యులు రామకృష్ణ ప్రసాద్, వివేక్ కరియావుల, వెంకట్ కోకా, తేజా గోయాల్లా, శ్యామ్ పంపానా, మధుకర్ రెడ్డి, సంపత్, ప్రసాద్, అమర్, నవీన్ తో పాటు బెల్జియం నుండి వచ్చిన ఇతర అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా నిర్వహిచారు.

error: NRI2NRI.COM copyright content is protected