సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ మోసం చేసిన సంగతి తెలిసిందే. 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నప్పటికీ, ఏదో కుట్రపూరితంగా క్రొత్త బిల్లును తెచ్చేపనిలో ఉన్నట్లు వినికిడి.
రైతులు దీనిపై కోర్టుల్లో ఒక పక్క న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇంకోపక్క ప్రజా క్షేత్రంలో కూడా తమకు జరిగిన అన్యాయాన్ని సాటిచెప్పాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’ ప్రారంభించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం.
అమరావతికి మద్దతుగా ఇంతకుముందే ‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’ అని అమెరికాలో ఒక సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. కొన్ని వారాలక్రితం రైతుల పాదయాత్రకు కోటి రూపాయల సహాయం ప్రకటించారు. ఇప్పుడు ఆ సహాయార్థంలో భాగంగా 54 లక్షల రూపాయలను నవంబర్ 27న అమరావతి పరిరక్షణ సమితికి అందజేశారు. మిగతా మొత్తాన్ని వచ్చేవారం అందజేస్తామని తెలిపారు.