నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు మే 27న కువైట్ లో యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది.
ఈ మహానాడులో అమరులైన నాయకులకు, కార్యకర్తలకు సంతాప సూచకంగా సభకు హాజరైన ప్రతినిధులు, పరిశీలకులు, అతిథులు, అందరూ మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారని యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలియచేసారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీ MLC, రాజంపేట నియోజక వర్గం ఇంచార్జ్, గౌరవనీయులు శ్రీ బత్యాల చాంగల్ రాయుడు ముఖ్య అతిధిగా, చంద్రశేకర్ రాజు గారు, బలరాం నాయుడు, కె. నరసింహ నాయుడు, యనిగల బాలకృష్ణ, సాయి సుబ్బారావు, కె. పార్ధసారది, రత్నం నాయుడు తుమ్మల, ప్రసాద్ పాలేటి, ఆవుల చిన్నయ్య యాదవ్, ఈరాతి శంకరయ్య, శీను, గుండయ్య నాయుడు, పసుపులేటి విజయకుమార్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకట రమణ పాల్గొన్నారు.
అలాగే రాచూరి మోహన్ (NRI TDP కువైట్, జాయింట్ సెక్రెటరీ), మల్లి కార్జున్ నాయుడు (NRI TDP కువైట్ తెలుగు యువత అధ్యక్షులు), వలసాని శంకర్ యాదవ్ (NRI TDP కువైట్ బీసీ అధ్యక్షులు), బొమ్ము నరసింహా, (NRI TDP కువైట్ బీసీ గౌరవ అధ్యక్షులు), రాణి చౌదరి గారు (NRI TDP కువైట్ మహిళా అధ్యక్షురాలు), ఇందు (NRI TDP కువైట్ మహిళా విభాగం కార్యదర్శి), వెలిగండ్ల శ్రీనివాసరాజు (NRI TDP కువైట్ వుపాధ్యక్షులు), మురళి నాయుడు (NRI TDP కువైట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి), రమేష్ కొల్లపనేని (NRI TDP కువైట్ తెలుగు యువత ప్రోగ్రాం Coordinator), జనార్ధన్ గుండ్ల పల్లె (NRI TDP కువైట్ బీసీ వుపాధ్యక్షులు), పెంచలయ్య పెరుమాల (NRI TDP కువైట్ బీసీ ప్రధాన కార్యదర్శి), కార్యదర్శులు, అధికార ప్రతినిదులు, సలహాదారులు, ముఖ్యంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారని , యన్.ఆర్.ఐ.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలియచేసారు.