తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారికి స్కిల్ కేసులో బెయిల్ వచ్చిన శుభసందర్భంలో సంతోషాన్ని పంచుకుంటూ “సత్యమేవ జయతే” కార్యక్రమాన్ని నవంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం మరియు జనసేన సభ్యులతో జూం వేదికగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిది శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరాం గారు పాల్గొన్నారు. ముఖ్యనేతలు ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ శ్రీచప్పిడి రాజశేఖర్ గారు, తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ రావి రాధాకృష్ణ గారు, గల్ఫ్ లోని వివిధ దేశాల ఎన్నారై టిడిపి అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు, ఇతర దేశాల ఎన్నారై టిడిపి (NRI TDP) అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
అలాగే గల్ఫ్ దేశాల లోని జనసేన (Janasena) జాతీయ కన్వీనర్స్ మరియు ప్రాంతీయ కన్వీనర్స్ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎన్నారై తెలుగుదేశం కువైట్ మరియు జనసేన కువైట్ వారి ఆధ్వర్యములో నిర్వహించిన ఈ కాల్లో పట్టాభిరాం గారు మాట్లాడుతూ.. చంద్రబాబు గారు మచ్చలేని నాయకుడని, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన 39 పేజీల చంద్రబాబు గారి బెయిల్ రిపోర్ట్ లో వైసిపి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి క్లియర్ గా వివరించబడ్డాయి అన్నారు.
కొమ్మారెడ్డి పట్టాభిరాం (Pattabhi Ram Kommareddy) గారు ప్రవాసాంద్రులు అడిగిన వివిధ రకాల సందేహాలకు వివరంగా సమాదానాలను వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన అందరికీ ఎన్నారై తెలుగుదేశం (Telugu Desam Party) గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం (NRI TDP) గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, ఎన్నారై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్ ఆళ్ళ, గొట్టిపాటి రమణయ్య, మొహమ్మద్ ఇమాం, అక్కిలి నాగేంద్రబాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు సత్యనారయణ మలిరెడ్డి, ఖాదర్ బాషా. హరిబాబు తక్కెళ్ళపాటి పాల్గొన్నారు.
ఇతర నాయకులు షేక్ బాషా, నరేష్ మద్దిపోటి, రవి పొనుగుమాటి, వాసు రెడ్డి. విక్రం సుఖవాసి, సుబ్బారెడ్డి గాజులపల్లి, సుబ్బారెడ్డి విసి, వరప్రసాద్, సారధి నాయుడు, భాస్కర్, రాఘవేంద్ర, రషీదా బేగం, కొల్లి ఆంజనేయులు, శివ మద్దిపట్ల, వంశీ కాపెర్ల, నరేష్, బాల రెడ్డయ్య, వెంకట్రామ రాజు, సుబ్బ రాజు, వెంకటబుజ్జి, సుగుణ, భాస్కర్, మోహన్, సిద్దులయ్య కూడా పాల్గొని మద్దతు పలికారు.
అలాగే జనసేన పార్టీ (Jana Sena Party) నాయకులు రామచంద్రనాయక్, శ్రీకాంత్ కాంచన, అంజన్ కుమార్ పగడాల, ఆకుల రాజేష్, జగిలి ఓబులేసు, కలుపురి భాస్కర్, సూర్య, గుంటూరు శంకర్, చంద్ర శేఖర్, పలుకూరి భాస్కర్ మొదలగువారు వందలాది మంది పాల్గొన్నారు.