Connect with us

Jana Sena

London: యూకేలో టీడీపీ & జనసేన మొదటి ఉమ్మడి సమావేశం విజయవంతం

Published

on

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తులో భాగంగా, టీడీపీ- జనసేనకి సంబంధించిన ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు ఆదివారం సాయంత్రం లండన్ నగరంలో సమావేశమయ్యారు. సమావేశంలో ముందుగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి మీద పెట్టిన అక్రమ కేసులని, అక్రమ అరెస్టుని ఖండిస్తూ తెలుగుదేశానికి బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఎన్నారై తెలుగుదేశం యూకే విభాగం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుని, ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలకి, ఇరు పార్టీలు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి సమిష్టిగా, యూకేలోని టీడీపీ జనసేన ఎన్నారైలు పనిచేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. వైసీపీ పాలనలో ఏపీ అధమ స్థానానికి పడిపోయిందని, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ సైకో ప్రభుత్వాన్ని కలిసికట్టుగా పనిచేసి, అరాచక వైసీపీ పాలనని అంతమొదించాలని సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలియజేశారు.

సైకో పోవాలి..ఏపీ బాగుపడాలి, హలో ఏపీ..బై బై వైసీపీ అనే నినాదాలతో హోరెత్తించారు. తదుపరి ప్రణాళికను రూపొందించుకుని, కలిసికట్టుగా పనిచేసి, ప్రజలను చైతన్యపరచి, దుర్మార్గపు వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించి, రాష్ట్రాభివృద్ధి కోసం తమ వంతు కృషిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీలకి సంబంధించిన కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected