Connect with us

Politics

ఎమోషనల్ డ్రామాలొద్దు, 24 జనసైనికులను అసెంబ్లీలో కూర్చోపెట్టండి, భవిష్యత్తు జనసేనదే

Published

on

ఎమోషనల్ డ్రామా పక్కనెట్టి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, మన జనసేన పార్టీ (Jana Sena Party) కి అసెంబ్లీలో 24 ఎంపీ 3 సీట్లు మంచి విషయమే. గౌరవప్రదమైన సంఖ్య కూడా. నియోజకవర్గాల్లో బలంగా ఉండటం ఫాలోయింగ్ ఉండటం వేరు, పోల్ మేనేజ్మెంట్ వేరు. పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) గారి లాంటోళ్ళనే రెండు చోట్లా ఓడగొట్టిన రాష్ట్రమిది.

ఏం టిఫిన్ కావాలని పదిమందిని అడిగితే.. ఎనిమిది మంది తలా ఒకటి చెప్పి ఇద్దరు చెప్పిన ఉప్మా అందరికీ దిక్కయిందట. ఒంటరి పోరులో తలా ఇంత పంచుకుంటే ఈ మాత్రమూ దక్కవు. సో, బీ బ్రేవ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత, కూటమి చేసిన కొత్త హామీలు, జనసేన సైన్యం, తెదేపా (Telugu Desam Party) అనుభవం, భాజపా (Bharatiya Janata Party) చేరిక అన్నీ సానుకూల అంశాలే.

ఈ ఇరవై నాలుగు గెలిపించుకునే పనిలో పడండి. తక్కువొచ్చాయని పక్క దారి పడితే ఉన్నదీ, ఉంచుకున్నదీ రెండూ పోయినట్టే. అధ్యక్షుల (Pawan Kalyan) వారు ఆలోచించకుండా నిర్ణయమైతే తీసుకోరు కదా? ఎమోషనల్ డ్రామాలొద్దు. అలాంటి డ్రామా గాళ్ళని దూరం పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టండి. పక్క పార్టీ రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.

ఈసారి సీఎం కుర్చీ దక్కినా దక్కక పోయినా రాష్ట్రంలో రాజకీయంగా ఇంకా గట్టిగా నిలబడ్డానికి ఇది మంచి అవకాశం. రాసిపెట్టుకోండి, భవిష్యత్తు జనసేనదే. అరాచకాలు చిత్తవ్వాలంటే పొత్తు అనివార్యం కావాల్సిందే. మనందరికీ సమాజంలో ఇంత మంచి గుర్తింపుని, ఇంత మంచి బలగాన్ని, ఇంత మంచి స్థాయిని ఇచ్చిన జనసేన పార్టీ (Jana Sena Party)ని ఎటువంటి పరిస్థితిలోనైనా కాపాడుకోవడం మనందరి బాధ్యతే కాదు, కనీస ధర్మం కూడా.

– సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected