జనసేన మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా జనసేన జనరల్ సెక్రటరీ శ్రీ సత్య బొలిసెట్టి గారు మరియు జనసేన కృష్ణా జిల్లా ఇంచార్జ్ శ్రీ రాంకృష్ణ బండ్రెడ్డి గారు అట్లాంటా జనసైనికులతో స్ప్రింగ్ హిల్ సూట్స్ లో శనివారం, ఏప్రిల్ 1, 2023 న సమావేశం అయ్యారు.
ఈ కార్యక్రమానికి శ్రీ సుబ్బుకోట గారు మరియు శ్రీ ప్రసాద్ సమ్మెట గారు కూడా ముఖ్య అతిధిలుగా హాజరు అయ్యారు. శ్రీ సత్య బొలిసెట్టి గారు మొదట మాట్లాడుతూ పర్యవరణ సం రక్షణ పై సమగ్ర అవగాహణ కల్పించారు. అలాగే జనసేన పై ఎన్.ఆర్.ఐ ల పాత్ర పై కూలంకషంగా చర్చించారు.
శ్రీ రాం కృష్ణ బండ్రెడ్డి గారు మాట్లాడుతూ కృష్ణా జిల్లా లో జరిగే జనసేన కార్యక్రమాలలో ఎన్.ఆర్.ఐ లు విరివిగా పాల్గొనాలని, జనసేన ని మరింత బలోపేతం చెయ్యాలని ఆకాంక్షిచారు. అట్లాంటా ఎన్.ఆర్.ఐ జనసేన కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని జనసేన సమావేశాన్ని విజయవంతం చేశారు.