Connect with us

Politics

ఉదయగిరి ఎమ్మెల్యేగా Raleigh NRI సురేష్ కాకర్ల విజయదుందుభి: Nellore

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల కూటమి (National Democratic Alliance – NDA) కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ 135, జనసేన పార్టీ 21 మరియు భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలుచుకొని విజయదుందుభి మోగించారు.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నుంచి నెల్లూరు జిల్లా, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరానికి చెందిన ప్రముఖ ఎన్నారై సురేష్ కాకర్ల (Suresh Kakarla) ఘన విజయం సాధించారు. 24 రౌండ్లపాటు సాగిన కౌంటింగ్ అనంతరం 9621 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

మొదటి విడత లోనే టీడీపీ (Telugu Desam Party) తరపున పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న సురేష్ కాకర్ల రెండున్నర సంవత్సరాల క్రితమే అమెరికా నుంచి ఇండియా వెళ్లి, ఉదయగిరి అసెంబ్లీ (Udayagiri Assembly Constituency) పరిధిలో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలోకి వెళ్లారు.

కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్ (Kakarla Charitable Trust) ని ఏర్పాటుచేసి మహిళా సాధికారత కోసం (Women Empowerment) వృత్తి విద్య నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్ధికంగా మరియు హార్దికంగా తోడ్పాటు, పాఠశాలలకు సహాయం, ఆరోగ్య శిబిరాలు, అణగారిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను దరిచేర్చడం వంటి వాటితో ఉదయగిరి ప్రజల మనస్సులో సుస్థిర స్థానం ఏర్పాటుచేస్తుకున్నారు.

సురేష్ కాకర్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ లో కూడా పలు సేవలందించారు. దీంతో సురేష్ ఆప్త మిత్రుడు, తానా అపలాచియన్ ప్రాంత సమన్వయకర్త రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) ఈ ఎన్నికల సమయంలో ఇండియా వెళ్లి మరీ క్యాంపైన్, మాపింగ్, నియోజకవర్గం (Udayagiri Assembly Constituency) బయట సెటిల్ అయిన ఓటర్లను మొబిలైజ్ చేయడం వంటి విషయాల్లో తోడ్పడ్డారు.

ఈ సందర్భంగా రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ… యువరక్తంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తన మిత్రుడు సురేష్ కాకర్ల (Suresh Kakarla) అందరికీ స్ఫూర్తినిచ్చారన్నారు. తన నాయకత్వ పటిమ, దూర దృష్టి ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఇదే ఉత్సాహంతో ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు.

ఇలా ఇండియా వెళ్లి తోడ్పడిన వారిలో ర్యాలీ (Raleigh, North Carolina) వాసులు వినోద్ కాట్రగుంట, కుమార్ చల్లగొల్ల, ప్రసాద్ వేములపల్లి, సుధీర్ ముప్పిరాజు ఉన్నారు. వినోద్ కాట్రగుంట స్వతహాగా ఉదయగిరి (Udayagiri Assembly Constituency) నియోజకవర్గానికి చెందిన వారవడంతో, తను మరియు తన బంధువర్గం లోకల్ గా సహాయం చేశారు.

అలాగే అమెరికా నుంచి ప్రవీణ్ తాతినేని, రామ్ అల్లు, మూర్తి అక్కిన, విజయ్ కాట్రగుంట, మిథున్ సుంకర, కేశవ్ వేముల, వంశి బొట్టు, శశిధర్ చదలవాడ, శివ మాచినేని, శ్రీని పెండ్యాల, సిద్ద కోనంకి, మధు సుంకు, సునీల్ కొల్లూరు, రమేష్ తుమ్మలపల్లి, శ్రీపాద కాసు, వెంకట్ కోగంటి, రవి లాము, కిరణ్ కాకర్లమూడి, వంశి కట్టా, రవీంద్ర దర్శి, వెంకట్ దగ్గుబాటి, గిరి నర్రా, రమేష్ పసుమర్తి, సురేష్ జాగర్లమూడి, బాల గర్జల, రాజ్ యార్లగడ్డ, జీవన్, శ్రీనివాసరావు సుంకర, కిషోర్ కుమార్ తదితరులు కూడా తమ సహాయసహకారాలు అందించారు.

మొత్తంమీద తమ స్నేహితుడు ఉదయగిరి (Udayagiri, Nellore) వెళ్లి సమర్ధవంతంగా ఎన్నికల (Elections) మహాసంగ్రామంలో విజేయుడైనందుకు ర్యాలీ ప్రవాసులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నరు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుండి పలువురు సురేష్ కాకర్ల ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected