ఏప్రిల్ 19న అమెరికాలోని 50 ప్రముఖ నగరాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లాస్ ఏంజలస్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు అభిమానులు సమావేశమయ్యారు.
లాస్ ఏంజలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులసమక్షంలో మంగళవారం రోజున నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్ కట్ చేసి అందరికీ పంచారు.
జై చంద్రబాబు, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం వంటి నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు 2024 లో నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తుందని అభిప్రాయపడ్డారు.