Connect with us

Arts

నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో వీణా వినోదం: ప్రముఖ వీణా విద్వాంసులు ఫణి నారాయణ

Published

on

తెలుగు భాష, తెలుగు కళల పరిరక్షణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో వీణానాదంపై వెబినార్ నిర్వహించింది. ఆర్ఆర్ఆర్, మహానటి, మగధీర లాంటి ఎన్నో చిత్రాల్లో వీణానాదంతో మెప్పించిన ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణ ఈ వెబినార్‌కి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

మన సంస్కృతి, మన సంగీతం కాపాడుకుంటూనే నేటి తరం ఇష్టపడే సంగీతాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫణి నారాయణ తెలిపారు. సినిమా సంగీతంతో పాటు మన దేశ సంగీత ప్రవాహంలో కర్నాటక సంగీత ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. కర్నాటక సంగీతం నేర్చుకున్న వారు ఏ సంగీతమైనా సులువుగా నేర్చుకోగలరని తెలిపారు.

వీణానాదంలో భావోద్వేగాలను సులువుగా పలికించవచ్చని తెలిపారు. మనస్సును ఆహ్లాద పరచడానికి మనలోని భావలను పలికించడానికి వీణలో ఎన్నో స్వరాలు ఉన్నాయని ఫణి నారాయణ అన్నారు. వీణల్లో రకాలు, తదితర వివరాలూ తెలియచేస్తూ శ్రోతల, వీక్షకుల ప్రశ్నలకు సమాధానాలు తెలియచేశారు.

కొన్ని సినిమా పాటల నుంచి తన వీణానాదంతో స్వరాలను వినిపించి వెబినార్‌లో పాల్గొన్న వారిని మంత్ర ముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు కిభశ్రీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ తెలుగు కళల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి వివరించారు.

కిభశ్రీ, శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, గిరి కంభంమెట్టు, శ్రీనాథ్ జంధ్యాల, మురళీ మేడిచెర్ల తదితరులు నాట్స్ లలిత కళావేదిక ద్వారా నెలనెలా తీసుకువస్తున్న ఈ వెబినార్ లో అందరూ పాల్గొని ప్రోత్సహిస్తున్నందుకు నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, చైర్ వుమన్ అరుణ గంటి అభినందనలు తెలియచేశారు. వెబినార్‌లో పాల్గొన్నవారు అడిగిన ప్రతి స్వరాన్ని వినిపించి అందరినీ సంగీతంతో మైమరిపించిన ఫణినారాయణను నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected