Connect with us

Elections

కాలిఫోర్నియాలో నరేన్‌ కొడాలి ప్యానెల్ సభ్యుల ప్రచారం విజయవంతం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎలక్షన్స్ లో జాయింట్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న వెంకట్‌ కోగంటి, జాయింట్‌ ట్రెజరర్‌ పదవికి పోటీ పడుతున్న సునీల్‌ పంట్ర, నార్త్‌ కాలిఫోర్నియా (California) ఆర్‌విపి అభ్యర్థి వెంకట్‌ అడుసుమిల్లి శాక్రమెంటో మరియు ఫ్రీమాంట్‌ లో ఏప్రిల్ 16 ఆదివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమను గెలిపించాల్సిందిగా తానా సభ్యులను, మిత్రులను కోరారు. నరేన్‌ కొడాలి (Naren Kodali) ప్యానెల్ కి చెందిన వీరు తాము చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. త్వరలోనే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతానికి సహకరించిన రమ కోమటి (Sacramento) టీమ్‌కు, శ్రీకాంత్‌ దొడ్డపనేని (Fremont) టీమ్‌కు, ఇతర మిత్రులకు, వచ్చిన తానా (TANA) సభ్యులకు కాలిఫోర్నియాలో నరేన్‌ కొడాలి టీమ్‌కు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వెంకట్‌ కోగంటి (Venkat Koganti) ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected