తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) వారు నవంబర్ 13 ఆదివారం రోజున దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ లోని ఫ్లషింగ్ పట్టణంలోని హిందూ టెంపుల్లో నిర్వహించనున్న ఈ దీపావళి వేడుకలలో ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించనుంది.
కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన ట్రూప్ తో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ట్రూప్ లో అనూప్ రూబెన్స్ తోపాటు గాయనీగాయకులు లిప్సిక, ధనుంజయ్, సాహితి, రోహిత్, రాపర్ రోల్ రీడా తదితరులు ఉన్నారు.
పదునైన సంభాషణలతో ఆకట్టుకొనే యాంకర్ సమీరా కూడా విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టికెట్ కేవలం పదిహేను డాలర్లు మాత్రమే. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలనుకునేవారు కల్చరల్ టీం సభ్యులు నెహ్రూ కఠారు, మాధవి కోరుకొండ, కిరణ్ రెడ్డి పర్వతాల మరియు అరుంధతి అడుప లను సంప్రదించండి.
You must be logged in to post a comment Login