Connect with us

Government

జగన్ కి మోతమోగించిన మినియాపోలిస్ తెలుగువారు @ Minnesota

Published

on

మినియాపోలిస్, మిన్నెసోటా లో నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా నిరసనలు కొనసాగుతున్నాయి. “మోత మొగిద్దాం” అనే కార్యక్రం మేరకు నిన్న మినియాపోలిస్, మిన్నెసోటా లో మరోసారి నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమానికి పెద్దలు, పిల్లలు, మహిళలు హాజరయ్యారు. స్థానిక తెలుగువారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందరూ మోతలు చేస్తూ నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) కి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

దీంతో మిన్నెసోటా (Minnesota) రాష్ట్రంలోని మినియాపోలిస్ తెలుగు ప్రవాసులు జగన్ కి మోతమోగించినట్లయింది. అక్టోబర్ 1 మధ్యాహ్నం 3 గంటలకు అందరూ ఒకచోట సమావేశమై మోత మోగిద్దాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected