Connect with us

Jana Sena

New Jersey: మన్నవ మోహన కృష్ణ అతిథిగా టీడీపీ, జనసేన ప్రవాసుల ఆత్మీయ సమావేశం

Published

on

“మేము సైతం బాబు కోసం“అంటూ అమెరికాలోని న్యూ జెర్సీ (New Jersey), ఎడిసన్ (Edison) నగరంలో చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విపరీతమైన చలిలో కూడా 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) డైరెక్టర్, గుంటూరు పశ్చిమ (Guntur West) నియోజకవర్గ నాయకులు మన్నవ మోహన కృష్ణ (Mohan Krishna Mannava) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ.. మచ్చలేని నేత నారా చంద్రబాబు నాయుడుకు అవినీతి రంగు పూయడానికి జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నీతి నిజాయితీలకు నిలువెత్తునిదర్శనమైన చంద్రబాబు నాయుడుకు ఆపద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలతో పాటు ప్రవాసాంద్రులు కూడా వెన్నుదన్నుగా నిలిచారన్నారు.

రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడకే పరీక్ష అని, ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టడానికి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంద్రుడు వెన్నుదన్నుగా నిలవాలని మన్నవ మోహనకృష్ణ అన్నారు.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు “మేము సైతం బాబు కోసం“ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ బాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు.

2024 ఎన్నికల్లో టిడిపి జనసేన (Janasena) కూటమికి అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు విదేశాలలోని ప్రతి ఆంధ్రుడు సంఘీభావంగా నిలవాలని కోరుతూ ఆత్మీయ సమావేశం తీర్మానించింది. విపరీతమైన చలిలోనూ 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభిమానులు మరియు జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్, వంశీ వెనిగళ్ల, వెంకట్ సూడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యటానికి అందరూ విశేష కృషి చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected