హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికా ఫ్లైట్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి యూఎస్ఎ ఎన్నారైలు న్యూ జెర్సీ లో కలిసి మెమోరాండం సమర్పించారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు.
ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే USA లోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్‌లను కలిగి ఉన్నాయని, USA నుండి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని ఏర్పాటు చేయడం వల్ల నగరాన్ని దాని ప్రత్యర్ధులతో సమానంగా ఉంచవచ్చన్నారు.
అలాగే వాణిజ్యం, పెట్టుబడులు మరియు పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్‌కు ఆకర్షణ పెరుగుతుందన్నారు. అమెరికా (USA) నుండి హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గాన్ని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెమోరాండం సమర్పించిన వారిలో విలాస్ జంబుల, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి, క్రిష్ణా రెడ్డి అనుగుల, లక్ష్మణ్ అనుగుల, శ్రీనివాస్ దార్గుల, గోపి సముద్రాల, మురళి చింతలపాని, రాజ్ చిముల, రఘు, కృష్ణ మోహన్ మూలే, శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.