Connect with us

Politics

Royal Leader RRR in Raleigh; శ్రేయోభిలాషుల ఆత్మీయ సమావేశం విజయవంతం

Published

on

భారత పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘు రామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) మరోసారి అమెరికా పర్యటనకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగష్టు 30 బుధవారం రోజున నార్త్ కెరొలినా రాష్ట్రం, ర్యాలీ నగరాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు (RRR) శ్రేయోభిలాషులు ర్యాలీ (Raleigh, North Carolina) నగరంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 300 మంది కుటుంబ సమేతంగా ఈ మీట్ అండ్ గ్రీట్ (Meet & Greet) కార్యక్రమానికి హాజరవడం విశేషం.

వంశి బొట్టు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవరించారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, ముఖ్య అతిథి రఘు రామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) కి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకగా, తను అందరితో కలివిడిగా మాట్లాడుతూ, కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

అందరూ ఆసీనులవగా ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరు స్థానికులు సభికులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం రఘురామ కృష్ణం రాజు ని వేదిక మీదకు ఆహ్వానించగా, ఎప్పటిలానే గోదావరి వాళ్ళ స్టయిల్లో ప్రసంగించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం సైకో ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అధోగతి పాలయ్యింది, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన విధానం, ఫేక్ ఉచిత తాయిలాలు, తన నియోజకవర్గం నరసాపురం వెళ్ళడానికి సృష్టిస్తున్న ఇబ్బందులు, 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం వంటి విషయాలపై కూలంకుషంగా వివరించారు.

తర్వాత పలువురు సభికులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ నవ్వులు పూయించారు. ర్యాలీ (Raleigh) నాయకులు రఘు రామ కృష్ణం రాజు (RRR) ని ఘనంగా సత్కరించారు. తదనంతరం అందరికీ విందు భోజనం అందించారు. చివరిగా వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో తానా అప్పలాచియాన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి రాజేష్ యార్లగడ్డ, రాజు గాదిరాజు, రాజు నడింపల్లి, విక్రం ఇందుకూరి, రాజ్ కూరపాటి, రాజ్ కొలిపర, సునీల్ కొల్లూరు, ప్రవీణ్ తాతినేని, రామక్రిష్ణ అల్లు, శశిధర్ చదలవాడ, మిథున్ సుంకర, వినోద్ కాట్రగుంట, కేశవ్, సిద్ద, శ్రీపాద, రమేష్ తుమ్మలపల్లి, వెంకట్ కోగంటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected