Connect with us

Politics

అట్లాంటా ఎన్నారై, గుడివాడ టీడీపీ నేత రాము వెనిగండ్లతో ఆత్మీయ సమావేశం: Philadelphia NRI TDP

Published

on

పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అట్లాంటా ఎన్నారై, గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఎగరవేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న సీనియర్ నేత రాము వెనిగండ్ల (Ramu Venigandla) ని ఘనంగా సత్కరించారు.

రాము వెనిగండ్ల స్వస్థలం గుడివాడ (Gudivada) కాగా సుదీర్ఘకాలం పాటు అయన అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో నివాసం ఉంటూ ప్రవాస తెలుగువారికి ఎన్నో అత్యున్నత సేవలు అందిస్తున్నారు. వారి సేవలు కర్మభూమిలోని తెలుగువారికే పరిమితం కాకుండా, జన్మభూమిలోని తెలుగువారికి ఆసరాగా నిలిచి పలు స్వచ్చంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాము వ్యక్తిగత కార్యక్రమాలలో భాగంగా ఫిలడెల్ఫియా పరిసరాలలో నివాసం ఉంటున వారి బంధువులు ఇంటికి విచ్చేయగా, ఎన్నారై టీడీపీ టీమ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. గుడివాడ నియోజకవర్గం ఓటరు ఒకరు ఎన్నారై టీడీపీ కండువా కప్పి, రాబోయే ఎన్నికలలో గుడివాడ వాసులందరు అభివృద్ధికే పట్టం కట్టి, రాము వెనిగండ్ల ని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు వారి అభిప్రాయాలను, సూచలను, సలహాలను రాము వెనిగండ్లతో పంచుకోవటం జరిగింది. వారిలో ఒకరు రాముని ఉద్దేశించి ఒక పాట కూడా పాడారు. అక్కడకి వచ్చిన వారందరికి రాము కరచాలనం చేసి పేరు పేరున ఆత్మీయంగా పలకరించడం విశేషం.

ఈ సందర్భంగా రాము వెనిగండ్ల మాట్లాడుతూ వారి అమెరికా ప్రస్థానం, నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ సేవ కార్యక్రమాలు, ప్రతిభావంతులైన ప్రవాస యువతకు కలిపించిన ఉద్యోగ అవకాశాలు మొదలైన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉందని, అమ్మలాంటి రాష్ట్రానికి దార్శనికులు, నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ఉంది అన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కుంటి పడిందని రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సత్తా ఒక చంద్రబాబు (Nara Chandrababu Naidu) కి మాత్రమే ఉంది అని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఎందరో నాయకులకి స్ఫూర్తి ప్రదాత మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో అందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అని రాము పిలుపునిచ్చారు.  

ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం శ్రీధర్ అప్పసాని నేతృత్వంలో హరినాథ్ బుంగతావుల, సునీల్ కోగంటి నిర్వహించగా రవి పొట్లూరి, కిరణ్ కొత్తపల్లి, విశ్వనాథ్ కోగంటి, రఘు ఎద్దులపల్లి, రాజశేఖర్ అల్లాడ, సతీష్ తుమ్మల, ఫణి కంతేటి, అశోక్ దండమూడి, రామకృష్ణ గొర్రెపాటి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మనబోయిన, మూర్తి నూతనపాటి, పార్ధ మాదల, చక్రి మట్టా, నాగయ్య నాయుడు, నేలపాటి, సాయి సుదర్శన్ లింగుట్ల, మధు బూదాటి, మధు కొల్లి, రవి మన్నే, గౌరి కర్రోతు, నందు మాదల, లవ కుమార్ ఐనంపూడి, అరవింద్ పరుచూరి, వెంకట్ పాలడుగు, భువన్ పెశ్వ, తిరుపతిరావు బీరపునేని, సంతోష్ రౌతు, శ్రీకాంత్ గూడూరు, చలం పావులూరి, రాధాకృష్ణ, ప్రసాద్ క్రొత్తపల్లి తదితరులతోపాటు పలువురు ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected