. కనీ వినీ ఎరుగని రీతిలో మన్నవ జన్మదిన వేడుకలు . వేలాదిగా హాజరయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు . గజ మాలతో చాటుకున్న అభిమానం . MMK Youth ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహణ . 200 కిలోల కేకును కట్ చేసిన మన్నవ మోహన కృష్ణ . బాణసంచాతో మార్మోగిన గుంటూరు జేకేసీ నగర్ . పార్టీ కార్యాలయం వద్ద అన్నదానం
ఆంధ్రప్రదేశ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, నాట్స్ మాజీ అధ్యక్షులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ (Mannava Mohana Krishna) జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 15న టీడీపీ నేతలు మరియు మన్నవ మోహన కృష్ణ యూత్ (MMK Youth) ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ ఎత్తున నిర్వహించారు.
కనీ వినీ ఎరుగని రీతిలో అంబరాన్ని అంటిన సంబరాలలో కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. స్థానిక జేకేసీ నగర్ ను భారీగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు నగరం లోని వివిధ డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ గా అభిమానులు, కార్యకర్తలు జేకేసీ నగర్లోని మన్నవ మోహన కృష్ణ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చారు. ర్యాలీ పొడవునా మన్నవ జిందాబాద్, టీడీపీ జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
200 కిలోల జన్మదిన కేకును కట్ చేసిన మన్నవ: టీడీపీ సీనియర్ నేత మన్నవ మోహన కృష్ణ జన్మదిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన 200 కిలోల భారీ కేకును మన్నవ మోహన కృష్ణ కట్ చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు కోలహలంతో, బాణాసంచాతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. మన్నవ మోహన కృష్ణ కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. మన్నవ మోహన కృష్ణ ను క్రేన్ ద్వారా అభిమానులు భారీ గజ మాలతో సత్కరించారు. జేకేసీ నగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే ధ్యేయం: 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేస్తానని మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నారై లతోపాటు అందరి సహకారంతో రానున్న ఎన్నికలలో అవినీతి పాలనకు చరమగీతం పాడుతామన్నారు.
ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ: మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకలకు వేలాదిమంది హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపి మన్నవ మోహనకృష్ణ మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, మాజీ మంత్రివర్యులు మాకినేని పెద్ద రత్తయ్య, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్ జూలకంటి బ్రహ్మ రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్ మహ్మద్ నస్సిర్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్, గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇంకారాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గుంటూరు నగర టీడీపీ కార్పొరేటర్లు తరలి వచ్చారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని పలు డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై మన్నవ మోహన కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.