కొత్త చిగురు చిగురించే వేళ
కోకిల కుహు కుహూలతో వసంత వాహిని పరిమళించే వేళ
ధరణిపై ప్రకృతి పచ్చని తివాచి పరిచిన వేళ
ప్రతి మనిషిలో స్పందించే గుణం జాగృతించిన వేళ
చైతన్యం నరనరాల్లో ప్రవహించిన వేళ
ప్రతి అంతం ఒక ఆరంభంగా మారే వేళ
ఆద్యంత రహితమైన జీవన శైలిని స్వీకరించే వేళ
ప్రతి అశ్రువు ఆనంద భాష్పంగా మారాలని,
జీవితం లోని చేదు, తీపి, పులుపు, వగరు అనుభవాలని కలగలిపి
ఉగాది పచ్చడితో మనమంతా
ఈ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరమున
శుభారంభాన్ని స్థితప్రజ్ఞతతో ఆహ్వానించాలని ఆశిస్తూ…
– మల్లికా రెడ్డి