Connect with us

Charity

బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ఛారిటీ కోసం లెజెండ్ సినిమా ప్రదర్శన @ Atlanta

Published

on

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ ‘లెజెండ్’ సినిమాని అట్లాంటాలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. జూన్ 10 బాలక్రిష్ణ జన్మదినం సందర్భంగా అమెరికా కాలమానం ప్రకారం జూన్ 9, శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ప్రదర్శించనున్నారు.

రాస్వెల్ లోని డిజిమాక్స్ థియేటర్స్ లో స్క్రీన్ చేస్తున్న ఈ సినిమాకి టికెట్ అవసరం లేదు. కానీ డొనేషన్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని యువరత్న నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ కి విరాళంగా ఇవ్వనున్నారు.

కావున అట్లాంటాలోని తెలుగు వారందరూ ఈ బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఛారిటీ స్క్రీనింగ్ కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ, అందరూ ఆహ్వానితులే అంటున్నారు నిర్వాహకులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected